చెన్నూరు: రైతులు, కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకున్న చెన్నూరు సహకార చెక్కర ఫ్యాక్టరీని తెరిపించాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. మంగళవారం చక్కెర ఫ్యాక్టరీని పరిశీలించిన భరద్వాజ కమిటీకి ఈ మేరకు ఆయన వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలోని సహకార చెక్కర ఫ్యాక్టరీల్లో ఏర్పడుతున్న నష్టాలకు కారణాలు, ఖాయిలా పడ్డ పరిశ్రమలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, పరిష్కారమార్గాలు సూచించేందుకు నియమించిన భరద్వాజ కమిటీ సభ్యులు మంగళవారం ఫ్యాక్టరీని పరిశీలించి కార్మికులు, రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కమిటీని కలిసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫ్యాక్టరీని సహకార రంగంలోనే నడిపి ైరె తులను, కార్మికులను ఆదుకోవాలని కోరారు. రైతులు, కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర విభజనతో ప్రత్యేక ప్యాకేజి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాలని డిమాండు చేసిన ఎన్డీఏ దానిని అమలులోకి తెచ్చి కరువు సీమలో ఉన్న ఫ్యాక్టరీలకు అవసరమైన నిధులిచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
యంత్రాలను పరిశీలించిన కమిటీ
కమిటీ బృందం ప్రతినిధి భరద్వాజ్ కమిటీ సభ్యులు వెంకట్రావు, రవీంధర్‌రావు, గురువారెడ్డి ఫ్యాక్టరీలోని రికార్డులు, యంత్రాలు, వాటి సామర్థ్యం, నీటి, భూ వనరులు, స్థితి గతులను పరిశీలించారు. రైతులు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తాము చెరుకు సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ప్రణాళిక ప్రకారం సాగుకు విత్తనం, ఎరువులు, చెరుకును ప్యాక్టరీకి తరలించేందుకు కూలీలు, గిట్టుబాటు ధర, బిల్లులు చెల్లింపులు సక్రమంగా ఉంటే ఎంతైనా సాగు చేసి చెరుకు పండిస్తామన్నారు. 1977 నుంచి చూస్తున్నామని సమస్యల వల్ల ఎప్పుడూ నష్టాలేనని, తమకు రావాల్సిన అలెవెన్సులు, బకాయిలు చెల్లిస్తే తాము బయటకు వెళ్లిపోతామని కార్మికులు అన్నారు. 36 నెలలుగా వేతనాలు, బకాయిలు అందక, చిక్కి శల్యమై ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల, కార్మికుల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను, ఇక్కడ ఉన్న వాస్తవాలను ప్రభుత్వానికి మార్చిలోపు నివేదిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు చీర్ల సురేష్‌యాదవ్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ జి.ఎన్. భాస్కర్‌రెడ్డి, నాయకులు పొట్టిపాటి ప్రతాప్‌రెడ్డి, పెడబల్లె రామమనోహర్‌రెడ్డి, పుల్లారెడ్డి, మన్నెం వెంకటసుబ్బారెడ్డి, అబ్దుల్బ్,్ర నరసింహారెడ్డి, వీరారెడ్డి, కార్మిక నాయకులు పి.క్రిష్ణ, పెంచల్‌రెడ్డి, రసూల్, రైతులు పాల్గొన్నారు.
చక్కెర ఫ్యాక్టరీ తెరవాలి
Published Wed, Feb 25 2015 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement