సదాశివనగర్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అనకాపల్లి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో చెరు కు సాగయ్యేది నిజామాబాద్ జిల్లాలోనే. నల్లబెల్లం ఉత్పత్తి లో కామారెడ్డి డివిజన్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. ఇదం తా గతం. పాలకుల నిర్ణయాలు చెరుకు ఫ్యాక్టరీల యాజమాన్యాలకు అనుకూలంగా ఉండడం, పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధర లభించకపోవడం, పంటను ఫ్యాక్టరీకి తరలించిన తర్వాత డబ్బులకోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుండడంతో చాలా మంది రైతులు చెరుకు సాగుకు దూరమవుతున్నారు.
ఖర్చులిలా..
ఎకరం విస్తీర్ణంలో చెరుకు సాగు చేసేందుకు అయ్యే ఖర్చుల వివరాలిలా ఉన్నాయి. ఎకరం విస్తీర్ణంలో చెరుకు సాగు చేయాలంటే మూడున్నర నుంచి నాలుగు టన్నుల విత్తనం అవసరం అవుతుంది. దీనికోసం రూ. 10 వేలు ఖర్చవుతా యి. దుక్కి దున్నడానికి రూ. 3 వేలు, కల్టివేటర్ కు రూ. 1,500, గెరకొట్టడానికి వెయ్యి రూపా యలు, మూడు దఫాల్లో రసాయనిక ఎరువుల పిచికారికి రూ. 6 వేలు, 20 మంది మహిళా కూలీలకు రూ. 2 వేలు, 10 మంది మగ కూలీ లకు రూ. 2,500, రెండోసారి కలుపు తీయడాని కి రూ. 2 వేలు, కాలువలు కొట్టేందుకు రూ. 2 వేలు, గెర కొట్టేందుకు రూ. 1,500, వాడె తీయడానికి రూ. 3 వేలు, తోట కట్టుటకు రూ. 6 వేలు, హా ర్వెస్టింగ్‌కు రూ. 17 వేలు ఖర్చు అవుతాయి. మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్ డ్రైవర్ల బత్తా, కూలీల విందు, కత్తి కట్నం తదితర ఖర్చులు అదనం. గతేడాది టన్ను చెరుకుకు రూ. 2,600 ధర లభించింది. ఎకరాకు సరాసరిన 28 టన్ను ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన సుమారు రూ. 72 వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి ఖర్చులు రూ. 60 వేల వరకు అవుతాయి. అంటే ఎకరం విస్తీర్ణంలో చెరుకు సాగు చేస్తే ఖర్చులు పోను రైతుకు మిగిలేది రూ. 12 వేలు మాత్రమే. పది నెలలపాటు రైతు కుటుంబం చేసిన శ్రమకు దక్కేది రూ. 12 వేలే కావడంతో పలువురు చెరు కు సాగుకు దూరమవుతున్నారు. చెరుకు టన్ను కు రూ. 4 వేలు చెల్లిస్తేనే గిట్టుబాటవుతుందని పేర్కొంటున్నారు.
రూ. 4వేలు చెల్లించాలి
చెరుకు రైతుకు కష్టాని కి తగిన ఫలం లభిం చడం లేదు. గత సీజన్ లో చెరుకు టన్నుకు రూ.2600 చెల్లిం చారు. ఈ సీజన్‌లో ఫ్యాక్టరీ ఇప్పటివరకు ధర నిర్ణయించలేదు. ప్రభుత్వం స్పందించి చెరుకుకు గిట్టుబాటు ధర కల్పించా లి. టన్నుకు కనీసం రూ. 4 వేలు చెల్లించాలి.
-బత్తుల రాంరెడ్డి, రైతు, మర్కల్
బిల్లుల కోసం తిరగాల్సి వస్తోంది
చెరుకు బిల్లులు చెల్లించడంలో ఫ్యాక్టరీ ఆలస్యం చేస్తోంది. పంటను తరలించేదాకా ఒక మాట చెబుతున్నారు. తరలించిన తర్వాత మరో మాట చెబుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కొక్కసారి ఈ తిరుగుడు కంటే చెరుకును నాటకపోవడమే మంచిదనిపిస్తోంది.
-ముడుపు బాల్‌రెడ్డి, రైతు, తిర్మన్‌పల్లి
గిట్టుబాటు కావడం లేదు
రోజు రోజుకూ పెట్టుబడులు పెరిగిపోతున్నయి. పంట సాగు కష్టంగా మారింది. చెరుకు పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి చెరుకుకు గిట్టుబాటు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి.
-నర్సారెడ్డి, రైతు, ఉప్పల్‌వాయి
చెరుకు.. కష్టాల సాగు
Published Sun, Oct 27 2013 3:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement