కరువు రహిత రాష్ట్రం కోసం సహకరించండి.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు
నెల్లూరు(బారకాసు): ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేంకు ప్రజలు సహకరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దారాఘవరావు అన్నారు. నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరుగుతున్న నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా ‘అశాస్త్రీయ విభజన, రాష్ట్ర ప్రగతిపై దాని ప్రభావం’ అనే అంశంపై మూడో రోజైన శనివారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు చేసేందుకు నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో కలిసేలా చేశారని తెలిపారు.
గోదావరి, కృష్ణా నదుల అనుసంధాన ప్రదేశమైన ఫెర్రీని పర్యాటక చారిత్రక ప్రదేశంగా తయారు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చంద్రబాబునాయుడు చెప్పిన మాట ప్రకారంగా కట్టుబడి పనిచేస్తున్నారన్నారు. భవిష్యత్తులో పరిశ్రమల ఏర్పాటు, ఓడరేవుల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పలు శాఖల అధికారులు రెండేళ్లలో జిల్లాలో సాధించిన పురోగతి గురించి వివరించారు.
మేయర్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, టీడీపీ నేతలు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కార్పోరేటర్ అనం రంగమయూర్‌రెడ్డి, తాళ్లపాక అనురాధ, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, అదనపు జాయింట్ కలెక్టర్ రాజ్‌కుమార్, ఓఎస్‌డీ పెంచలరెడ్డి, ప్రముఖ కవి పెరుగు రామకృష్ణ, హిజ్రాల సంఘం జిల్లా అధ్యక్షురాలు అలేఖ్య, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.