సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా ఒడిషా ప్రభుత్వం దాఖలు చేసిన సూట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుల మేరకు ప్రాజెక్టు నిర్మాణం కొనసాగడం లేదని ఒడిషా తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
36 లక్షల క్యూసెక్కుల నీటి కోసం ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సివుండగా, 50 లక్షల క్యూసెక్కులకు నిర్మాణం జరుగుతోందని అన్నారు. దీనిపై స్పందించిన ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు గోదావరి ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగానే ప్రాజక్టు నిర్మాణం సాగుతోందని చెప్పాయి.
ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ప్రాజెక్టుపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment