
తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న జస్టిస్ బాబ్డే. చిత్రంలో టీటీడీ చైర్మన్, ఈవో తదితరులు
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బాబ్డే శనివారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలో జస్టిస్ బాబ్డేకు పద్మావతి అతిథిగృహం వద్ద టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం సీజేఐ సహస్రదీపాలంకరణ సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన వరాహస్వామిని, అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆదివారం ఉదయం విరామ సమయంలో శ్రీవారిని మరోమారు దర్శించుకోనున్నారు. శనివారం దర్శనానంతరం మరమ్మతులు జరుగుతున్న కోనేరును జస్టిస్ బాబ్డే పరిశీలించారు. సీజేఐతో పాటు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment