
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలు బాచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు కట్టుబడి ఉండాలని సూచించింది. దీనిపై రానున్న మార్చిలోగా రాష్ట్రాలు అన్నీ అఫిడవిట్ ఇవ్వాలంటూ ఆదేశించింది. పోలవరంపై జరిగిన వాదోపవాదాల్లో ఒడిశా తరపు న్యాయవాది గోపాల సుబ్రమణ్యం మాట్లడుతూ పోలవరం తొలుత 36లక్షల క్యూసెక్కు సామర్థ్యంతో నిర్మాణం చేపట్టారని, కానీ ఇప్పడు దానిని ఏకంగా 50లక్షల క్యూసెక్కులకు పెంచారని అన్నారు.
దీనివల్ల ఒడిసాలోని లోతట్లు ప్రాంతాలు బ్యాక్‌వాటర్‌తో ముంపుకు గురౌతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరంపై ఒత్తిడి తగ్గుతుందంటూ వాదించారు. సుబ్రమణ్యం వాదనపై స్పందించిన సుప్రీంకోర్టు పర్యావరణ అనుమతులు ఉల్లంఘన తదితర అంశాలను తర్వాత వింటామని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment