చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పసిపిల్లలపై లైంగిక దాడి | Suryanarayana arrest Sexual assault in Amalapuram | Sakshi
Sakshi News home page

చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పసిపిల్లలపై లైంగిక దాడి

Published Fri, Jan 9 2015 12:19 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పసిపిల్లలపై లైంగిక దాడి - Sakshi

చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి పసిపిల్లలపై లైంగిక దాడి

అమలాపురం టౌన్ :పసిపిల్లలపై లైంగిక దాడి కేసులో అమలాపురానికి చెందిన రెడ్డి సూర్యనారాయణను పట్టణ పోలీసులు గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ నిందితుడిని పట్టణ పోలీసు స్టేషన్‌లో  మీడి యా ముందు హాజరుపరిచారు. బాలికలపై సూర్యనారాయణ ఆరునెలల పాటు లైంగిక దాడులకు పాల్పడ్డాడని డీఎస్పీ తెలి పారు. అమలాపురం మండలం పేరూరు పంచాయితీ పోస్టల్ కాలనీకి చెందిన సూర్యనారాయణ లేడీస్ టైలర్. గతంలో అతను ఉపాధికి కువైట్ వెళ్లడంతో కువైట్ తాతగా పరిచితుడు. 3, 5 తరగతులు చదువుతున్న 7,8,10 ఏళ్ల బాలికలు నలుగురిని అతడు  చాక్లెట్లు,
 
  బిస్కెట్లు, డబ్బులు ఇచ్చి చేరదీసి, లైంగికదాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. బాలికలకు సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాలు చూపించి వారిపై లైంగిక దాడి చేశాడని డీఎప్పీ తెలిపారు. ఇది ఎవరికైనా చెబితే చంపుతానని వారిని బెదిరించాడన్నారు. బాధిత బాలికలకు వైద్యపరీక్షలు చేయించామన్నారు.  376, 354(ఎ), 506, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్టు 3,4,5,6 కింద, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 3(1), 3(2) (వి)కింద అతడిపై కేసులు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. గురువారం మధ్యాహ్నం అమలాపురం కుమ్మరికాల్వ గట్టు శివాలయం వద్ద అతడిని అరెస్ట్ చేశామని, నీలిచిత్రాలు ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సూర్యనారాయణకు భార్య, కుమారులు, కుమార్తెలు, మనుమలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement