తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన తర్వాత జిల్లాల పునర్విభజన అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది. తెరపైకి సూర్యాపేట జిల్లా పేరు వచ్చింది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి, నకిరేకల్‌తోపాటు వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పడుతుందన్న ప్రచారం ఊపందుకుంది.
- సాక్షిప్రతినిధి, నల్లగొండ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం వెలువడటం జిల్లా వాసులను ఆనందంలో ముంచెత్తింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆది నుంచీ ముఖ్య భూమిక పోషించిన మన జిల్లాకు ఆ మేర గుర్తింపు కూడా ఉంది.
ఇక ప్రత్యేక రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాల్లో జిల్లాల పునర్విభజన కూడా ఒకటి కావడంతో జిల్లాను రెండుగా చీల్చి మరో జిల్లాను ఏర్పాటు చేస్తారన్న బలమైన నమ్మకం ఉంది. పన్నెండు నియోజకవర్గాలతో ఉన్న నల్లగొండ జిల్లాను రెండుగా చీల్చి కొత్తగా సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేస్తారన్న ప్రచారం కూడా బలంగా ఉంది. కొత్త జిల్లా డిమాండ్ అంతగా లేకున్నా, పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాను రెండుగా విభజిస్తే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం ఉంటుందన్న అంశంపై చర్చ మొదలైంది.
పొరుగు జిల్లాల నుంచి వచ్చి చేరే నియోజకవర్గాలు ఏమై ఉంటాయి..? జిల్లా నుంచి విడివడి సరిహద్దు జిల్లాలో ఏ నియోజకవర్గం కలిసే అవకాశం ఉంటు ందన్న అంశంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా అసెం బ్లీ నియోజకవర్గాల పునర్విభజన అయిదేళ్ల కిందటే జరగడం, ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాన్ని, మరో నియోజకవర్గం లేదా జిల్లాలోకి మార్చే వీలు ఉండదని, మార్చితే పూర్తిగా నియోజకవర్గం సాంతం మార్చాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇక నల్లగొండ జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్లకు పైనే దూరంగా ఉన్న ఆలేరు నియోజకవర్గంపైనా చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లా సిద్ధిపేటను జిల్లాగా మార్చాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సిద్ధిపేట జిల్లా ఏర్పాటైతే బొమ్మలరామా రం, తుర్కపల్లి, రాజపేట, యాదగిరిగుట్ట, ఆలేరు, గుండాల, ఆత్మకూరు(ఎం) మండలాలతో ఉన్న ఆలేరు నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలిపేందుకు అవకాశం ఉందన్న ప్రచారం కూడా ఉంది.
అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా మార్చే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాకు సరిహద్దుగా ఉన్న దేవరకొండ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో కలిపే వీలుందంటున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని డిండి, చందంపేట, దేవరకొండ, చింతపల్లి మండలాలు మహ బూబ్‌నగర్ జిల్లాకే దగ్గరగా ఉంటాయి. అచ్చంపేట, డిండి మధ్య వ్యాపార సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి.
ఒక వేళ బయటి జిల్లాల నుంచి తీసుకువచ్చి కలపడం, లేదా, ఇక్కడ నుంచి ఏదో ఒక నియోజకవర్గాన్ని తగ్గించి బయట జిల్లాకు కలపడం వంటి చర్యలు లేకుండానే జిల్లాలోని పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలతోనే రెండు జిల్లాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. కాగా సూర్యాపేట కొత్త జిల్లా ఏర్పాటుతో దూరభారం దగ్గడంతో పాటు, ఉపాధి అవ కాశాలు, ఉద్యోగాలు పెరుగుతాయని, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటలోకి వస్తాయన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఆ ప్రాంత నాయకులు, ఉద్యమ కారులూ ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.
తెరపైకి సూర్యాపేట జిల్లా?
Published Sun, Aug 11 2013 2:09 AM | Last Updated on Sun, Apr 7 2019 3:34 PM
Advertisement
Advertisement