సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల సందడి సద్దుమణగడంతో ఇప్పుడు అందరి దృష్టి మునిసిపల్ ఎన్నికల ఫలితలపై పడింది. జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుంతకల్లు, గుత్తి, హిందూపురం, కదిరి, ధర్మవరం మునిసిపాలిటీలు, కళ్యాణదుర్గం, పామిడి, పుట్టపర్తి నగర పంచాయతీలకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు మే 12వ తేదీకి వాయిదా పడింది. ఫలితాలకోసం అభ్యర్థులు 40 రోజులకు పైగా ఎదురు చూస్తున్నారు. ఫలితాలపై ఇప్పటికే సర్వత్రా టెన్షన్ మొదలైంది. గెలుపోటములపై ఎవరి ధీమాలో వారున్నారు.
మునిసిపల్ ఎన్నికల్లో చేసిన ఖర్చును బేరీజు వేసుకుని టీడీపీ నాయకులు గెలుపు మాదే అంటుండగా, వైఎస్సార్ ప్రకటించిన సంక్షేమ పథకాలు, జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మా, జనాభిమానం మా బలమని ఆ పార్టీ నాయకులంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం కౌన్సిలర్ అభ్యర్థులను కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేక చతికిలపడింది. పెకి టీడీపీ నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో లోలోపల వారిలో ఆందోళన నెలకొంది.
రెండు గంటల్లో ఫలితాలు
జిల్లాలోని కార్పోరేషన్, మునిసిపల్, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు జిల్లా అధికారులు పూర్తి చేశారు. నగరంలోని ఎస్‌ఎస్‌బిఎన్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అందుకు ఒక్కో మునిసిపాలిటీకి వార్డులను బట్టి కౌంటిగ్ టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఫలితాలు రెండు గంటల్లోనే వెలువడే విధంగా ఏర్పాట్లు చేశారు.
‘పుర’ ఫలితాలపై ఉత్కంఠ
Published Sun, May 11 2014 2:37 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement