స్వచ్ఛభారత్ లక్ష్యం నెరవేరేనా?
► మరుగుదొడ్ల బిల్లుల మంజూరులో జాప్యం
► లబ్ధిదారులు ఎదురుచూపు
► పట్టించుకోని అధికారులు
డక్కిలి: పద్మావతి, వెంకటమ్మల మాదిరిగా జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఎంతో మంది బాధితులు మరుగుదొడ్ల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మండల అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఆత్మగౌరవం పేరిటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది.
జిల్లాలో సుమారు 5 లక్షల 67వేల మరుగుదొడ్లు అవసరమని అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి 2లక్షల 42వేల మరుగుదొడ్లును మంజూరు చేశారు. మరుగుదొడ్లను నిర్మించుకున్న వారికి బిల్లులు మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలోని 46 మండలాల్లో ఇప్పటి వరకూ 36 వేల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పటివరకు లబ్ధిదారులకు బిల్లులు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 23వేల మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకూ పైసా కూడా ఇవ్వలేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
సిబ్బంది నిర్లక్ష్యంతోనే..
జిల్లాలోని పలు మండలాల్లో పని చేస్తున్న ఆత్మగౌరవం సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించకపోవడం, సకాలంలో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలను ఆన్‌లైన్ చేయకపోవడం తదితర కారణాలతో బిల్లులు నిలిచిపోయాయని లబ్ధిదారులు చెబుతున్నారు. జిల్లాలో 100 పంచాయతీల్లో బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చి దిద్దాలని అన్ని ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మే నెలఖరులోగా ఈ లక్ష్యాన్ని అధికమించాలని తగు చర్యలు తీసుకుంటున్నారు. లక్ష్యం ఘనంగా ఉన్నా బిల్లులు మంజూరులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది.
డక్కిలి మండలంలో 10,800 మరుగుదొడ్ల్లు మంజూరు
స్వచ్ఛభారత్ కార్యక్రమం అమలులో భాగంగా ఆత్మగౌరవం కింద 10,800 మరుగుదొడ్లు మంజూరు చేశారు. వీటిలో 2,683 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యాయి. అయితే అధికశాతం లబ్ధిదారులకు బిల్లులు రాలేదు. కొంతమందికి మాత్రం ఒక మరుగుదొడ్డికి రూ.11 వేలు రావాల్చి ఉండగా రూ.5వేలు మాత్రమే వచ్చింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్లకు సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
రూ.1100 మాత్రమే వచ్చింది: కొమ్మల బుజ్జమ్మ
ఆరు నెలలు క్రితం మరుగుదొడ్డి నిర్మించుకున్నా. రూ.1100 మాత్రమే బిల్లు వచ్చింది. మిగిలిన నగదు ఇప్పటి వరకు రాలేదు. పలుమార్లు అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదు.
డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేస్తాం: సుస్మితారెడ్డి, ఆత్మగౌరవం జిల్లా కో-ఆర్డినేటర్
ఈ ఏడాది డిసెం బర్ నెలాఖరకు జిల్లాలోని అన్ని గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలగా(ఓడీఎఫ్) తీర్చి దిద్దడానికి చర్యలు తీసుకుంటున్నా ం. దశల వారిగా పంచాయతీలను ఎంపిక చేస్తున్నాం. మరుగుదొడ్లు నిర్మించినవారికి బిల్లుల మంజూరులో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటాం. మరుగుదొడ్లు ఫొటోలను కంప్యూటర్‌లో జనరేట్ చేయడంలో లోపాలతో కొన్ని బిల్లులు నిలిచి యాయి. ఆ లోపాలను సరిదిద్దుతాం.
డక్కిలి మండలం వెంబులూరు ఎస్సీ కాలనీకి చెందిన నిడిగంటి వెంకటమ్మ కూడా అప్పుచేసి ఆరు నెలల క్రితం మరుగుదొడ్డి నిర్మించుకుంది. ఇప్పటి వరకు ఆమెకూ బిల్లు మంజూరు కాలేదు. మండల కార్యాలయాలు చుట్టూ తిరిగినా ఫలితం లేదు.