హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీజీ.వెంకటేశ్ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో బుధవారం సీఎంను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీఎంకు తెలిపానన్నారు. ప్రత్యేక రాష్ట్ర అంశం తెరమీదకు వచ్చిన తరుణంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌తో సహా కర్నూలు, కోస్తాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం తెలిపానన్నారు.
జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర తరహాలు రెండు, మూడు రాజధానులుంటే తప్పులేదని టీజే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీకి నివేదిక ఇవ్వడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.