కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్‌కు పచ్చజెండా ఊపడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి..
తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్, బీజేపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గురువారం రాత్రి ర్యాలీలు నిర్వహించారు.. యువత కేరింతలు కొడుతూ రహదారులపైకి వచ్చారు.. టపాసులు పేల్చారు.. మిఠాయిలు పంచుకున్నారు.. వర్షంలోనే నృత్యాలు చేశారు.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తీరిందంటూ.. ఉద్యమాల ఫలితంగా ‘ప్రత్యేక’ రాష్ట్రం వచ్చిందంటూ జై తెలంగాణ నినాదాలు చేశారు..
- సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణపై నోట్ విడుదల అవుతుందని గురువారం ఉదయం నుంచి వేచిచూడగా సాయంత్రం ఉత్కంఠకు తెరపడింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చే స్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 60 రోజుల క్రితం తీర్మానం చేసిన విషయం విధితమే. సుమారు రెండు నెలలపాటు కసరత్తు అనంతరం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, సీడబ్ల్యూసీ తీర్మానాలనే ఉటంకిస్తూ, రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుమారు రెండు గంటలపాటు ఢిల్లీలో సాగిన కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన చేయడంపై తెలంగాణవాదులు హర్షం వెలిబుచ్చారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, ముథో ల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ తదితర నియోజకవర్గాల్లో బాణాసంచా పేల్చి ర్యాలీలతో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నతోపాటు విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీలు, తెలంగాణవాదులు జిల్లా వ్యాప్తంగా జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు. దండేపల్లి మండలంలో గురువారం రాత్రి టీ నోట్‌కు కేబినెట్ పచ్చజెండా ఊపడంతో టీఆర్‌ఎస్, తెలంగాణవాదులు కుండపోతగా వర్షం కురిసినాజై తెలంగాణ నినాదాలు చేస్తూ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కట్ట వెంకటేశ్, తెలంగాణ వాదులు కొండు జనార్దన్, బొలిశెట్టి గంగన్న, సత్యం, లిగారెడ్డి,పెంట జలపతి పాల్గొన్నారు. భైంసా బస్టాండ్‌లో గురువారం రాత్రి టీ నోట్ ఓకే అవడంతో తెలంగాణవాదులు టసాసులు పేల్చారు. నృత్యాలు చేస్తూ తెలంగాణ నినాదాలు చేశారు. సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణాగౌడ్, నాయకులు నాగ్‌నాథ్, నరేశ్, రాజు ఉన్నారు.
అంబరాన్నంటిన ‘తెలంగాణ’ సంబరాలు
హైదరాబాద్‌సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర కేబినేట్ టీ-నోట్ విడుదల చేయడంతో జిల్లాలో గురువా రం నిర్వహించిన సంబరాలు అంబరాన్నింటాయి. తెలంగాణవాదులు బ్యాండుమేళాలు, డప్పు వాయిద్యాల మధ్య వర్షంలో సైతం నృత్యాలు చేస్తూ భారీగా టపాసులు పేల్చి ఒకరికొకరు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఏన్నాళ్లో వేచి చూస్తున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం కీలక ప్రకటన చే యడంపై అడుగడుగునా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నాలు గు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇన్నాళ్లకు తీరిందంటూ తెలంగాణవాదులు ‘జై తెలంగాణ’ నినాదాలతో ఊరేగింపులు నిర్వహించారు.
టీ-నోట్ ప్రకటనకు ముందు సుమారు రెండు గంటలపాటు జరిగిన కేబినేట్ సమావేశం పైనే చర్చ జరిగింది. గురువారం ఉదయం నుంచే చాలా మంది తెలంగాణవాదులు ఉత్కంఠగా టీవీలకు అతుక్కుపోయారు. ఎట్టకేలకు సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సమర్ధిస్తూ కేంద్ర కేబినేట్ 60 రోజుల తర్వాత హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రకటించడంతో జిల్లాలో సంబరాలు నిర్వహించారు.
టీ-నోట్ సంబరాలు
Published Fri, Oct 4 2013 2:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement