T-Note
-
టీనోట్‌ను కూడూ రాహూల్ చించేయాలి
-
వైఎస్సార్సీపీ బంద్ సంపూర్ణం
కర్నూలు, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి మండలిలో టీనోట్ ఆమోదానికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన 72 గంటల బంద్ విజయవంతమైంది. జిల్లాలో మూడో రోజు ఆదివారం వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాయి. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా అడ్డగోలు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి మొదలు పెట్టిన రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ దీక్షల్లో పాల్గొన్నారు. బంద్‌లో భాగంగా లారీలు, ఆటోలు చివరకు ద్విచక్ర వాహనాలు సైతం ఉద్యమకారులు అడ్డుకోవడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. వైఎస్సార్సీపీ శ్రేణులకు తోడుగా సమైక్యవాదులు కూడా ఆందోళనల్లో పాల్గొనడంతో సకలం మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులు మినహా జిల్లా అంతటా అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించారు. ఉదయం 8 గంటల నుంచే పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూయించారు. అడపాదడపా తిరుగుతున్న ఆటోలను కూడా గాలి తీసి అడ్డుకున్నారు. కర్నూలులో నియోజకవర్గం సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో పార్టీ శ్రేణులు నగరమంతా పర్యటించి దుకాణాలను బంద్ చేయించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాణ్యంలో నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో ఉల్చాల రోడ్డు నుంచి బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్ మీదుగా నంద్యాల చెక్‌పోస్టు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. గౌరీశంకర్ కాంప్లెక్స్ దగ్గర యథావిధిగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదోనిలో నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, స్థానిక నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, గురునాథరెడ్డి పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో బి.వి.రామిరెడ్డి , ఆలూరులో నియోజకవర్గం సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హోళగుంద, ఆలూరు మండల కన్వీనర్లు వీరన్న, షఫీవుల్లా పాల్గొన్నారు. ఇక్కడ రిలే నిరాహార దీక్షలు యదావిధిగా కొనసాగుతున్నాయి. హాలహర్విలో మండల కన్వీనర్ భీమప్ప చౌదరి ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. జననేత ఆమరణ దీక్షకు మద్దతుగా ఆత్మకూరులో 30 గంటల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ నాయకులు ఇస్కాల రమేష్, ఏరువ రామచంద్రారెడ్డి నాయకత్వంలో పట్ణణంలో బంద్ విజయవంతమైంది. బనగానపల్లెలో ఎర్రబోతుల వెంకటరెడ్డి, బేతంచెర్లలో డోన్ నియోజకవర్గం సమన్వయకర్త బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కోడుమూరులో నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ బంద్‌ను పర్యవేక్షించారు. మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధం చేశారు. సర్పంచ్ చల్లబండ్ల బీమయ్య, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. నందికొట్కూరులో పార్టీ నాయకులు ఐజయ్య, బండి జయరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పటేల్ సెంటర్లో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి రోడ్డును దిగ్బంధించారు. పత్తికొండలో నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. చక్రాల రోడ్డు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. జేఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. అలాగే వెల్దుర్తిలో కూడా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి పట్టణ బంద్‌ను పాటించారు. ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతుండగా నంద్యాలలో ఏవి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఆయా దీక్షల్లో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ.. టీనోట్‌ను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. -
సమైక్యవాదులపై ఎస్ఐ జులుం
పరిగి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని కొడిగెనహళ్లి వద్ద ప్రధాన రహదారిపై టీ-నోట్ ఆమోదానికి నిరసనగా శనివారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమైక్యవాదులపై ఎస్ఐ సుధాకర్ యాదవ్ దాడి చే శారు. బాధితుల కథనం మేరకు.. కొడికొండ-అమరాపురం ప్రధాన రహదారిపై ముళ్లకంపలు వేసి విద్యార్థులు, యువకులు సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. ఆ సమయంలో పోలీసు జీపులో వచ్చిన ఎస్ఐ, రోడ్డుపై ఉన్న వలీ అనే యువకుడి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ నిర్దాక్షిణ్యంగా చితకబాదారు. మిగతా వారిని సైతం తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో ఎస్ఐ అక్కడ నుంచి జారుకున్నారు. వందలాది మంది గ్రామస్తులు రహదారిపైకి చేరుకుని ఎస్ఐ తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. బాధితుడు వలీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అలాంటి వ్యక్తిపై ఎస్ఐ వీధి రౌడీలా ప్రవర్తించడం ఏ మాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్‌ను ముట్టడించాలని చర్చించుకున్నారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించాలని తిరిగి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ‘ఎస్ఐ డౌన్ డౌన్, పోలీస్ జులుం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కొందరు సమైక్యవాదులు నేరుగా ఎస్ఐకు ఫోన్ చేసి మీ తీరు బాగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ ఇక్కడకు వచ్చి క్షమాపణలు చెప్పాలని యువకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో ఇద్దరు పోలీసులు వచ్చి సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది. -
వైఎస్సార్సీపీ నేతృత్వంలో..సమైక్య బంద్
సాక్షి, కడప : టీ.నోట్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల ఆందోళనలో భాగంగా రెండవరోజు శనివారం బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ శ్రేణులకు అన్ని వర్గాల నుంచి సంఘీభావం లభించింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ టైర్లు, మొద్దులు, కంపచెట్లు కాల్చి వేస్తూ రహదారులను దిగ్బంధం చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్పత్రులు, మెడికల్ దుకాణాలు సైతం మూతపడ్డాయి. తోపుడు బండ్లు, ఆటోలు సైతం తిరగలేదు. కడపలో నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాషా మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు నేతృత్వంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి బంద్‌ను పర్యవేక్షించారు. వందలాది మంది కార్యకర్తలు మోటారు బైకులతో ర్యాలీగా తిరుగుతూ బంద్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు బంద్‌కు పూర్తిస్థాయిలో సహకరించడంతో జనజీవనం స్తంభించింది. వైఎస్సార్సీపీ నేతృత్వంలో బండి ప్రసాద్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత హనుమంతరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. ఎర్రగుంట్లలో జగన్ దీక్షకు మద్దతుగా గోపాల్‌రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో బి.కోడూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత ఓ.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలను విరమింపజేశారు. సోనియా, రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మలను శవపేటికలో పెట్టి శవయాత్ర నిర్వహించి దహన సంస్కారాలు నిర్వహించారు. బద్వేలు మున్సిపాలిటీ, గోపవరం, అట్లూరు మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలతో కలిసి వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. బంద్‌ను పర్యవేక్షించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. మైనార్టీ నాయకుడు మస్తాన్ నేతృత్వంలో ఐదుగురు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సంఘీభావం తెలిపి బంద్‌ను పర్యవేక్షించారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పట్టణంలో కలియ తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వాహనంలో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. నల్లదిమ్మాయపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత జి.వెంకట సుబ్బారెడ్డి నేతృత్వంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. మైదుకూరులో వైఎస్సార్సీపీ నేతలు మదీన దస్తగిరి, షౌకత్ అలీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. బంద్‌ను పర్యవేక్షించారు. కమలాపురం పట్టణంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి మండల పార్టీ కన్వీనర్ ఉత్తమారెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. క్రాస్‌రోడ్డులో బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. పూర్తి స్థాయిలో బంద్ కొనసాగింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సావిత్రమ్మ నేతృత్వంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పులివెందులలో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నేతృత్వంలో ఎర్రిపల్లి, అచ్చువెల్లి గ్రామాలకు చెందిన 100 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దేవిరెడ్డి శిశవంకర్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. రాయచోటి పట్టణంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణమంతా కలియదిరుగుతూ బంద్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బృందాలుగా ఏర్పడి వైఎస్సార్సీపీ కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. 3, 4, 5 వార్డులకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు మహబూబ్‌బాషా, జాకీర్ హుసేన్, అమీర్‌ఖాన్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. -
టీ-నోట్ సంబరాలు
కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్‌కు పచ్చజెండా ఊపడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి.. తెలంగాణవాదులు, టీఆర్ఎస్, బీజేపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గురువారం రాత్రి ర్యాలీలు నిర్వహించారు.. యువత కేరింతలు కొడుతూ రహదారులపైకి వచ్చారు.. టపాసులు పేల్చారు.. మిఠాయిలు పంచుకున్నారు.. వర్షంలోనే నృత్యాలు చేశారు.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తీరిందంటూ.. ఉద్యమాల ఫలితంగా ‘ప్రత్యేక’ రాష్ట్రం వచ్చిందంటూ జై తెలంగాణ నినాదాలు చేశారు.. - సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణపై నోట్ విడుదల అవుతుందని గురువారం ఉదయం నుంచి వేచిచూడగా సాయంత్రం ఉత్కంఠకు తెరపడింది. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చే స్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 60 రోజుల క్రితం తీర్మానం చేసిన విషయం విధితమే. సుమారు రెండు నెలలపాటు కసరత్తు అనంతరం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, సీడబ్ల్యూసీ తీర్మానాలనే ఉటంకిస్తూ, రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడంపై జిల్లావ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సుమారు రెండు గంటలపాటు ఢిల్లీలో సాగిన కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రకటన చేయడంపై తెలంగాణవాదులు హర్షం వెలిబుచ్చారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, ముథో ల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ తదితర నియోజకవర్గాల్లో బాణాసంచా పేల్చి ర్యాలీలతో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నతోపాటు విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీలు, తెలంగాణవాదులు జిల్లా వ్యాప్తంగా జరిగిన సంబరాల్లో పాల్గొన్నారు. దండేపల్లి మండలంలో గురువారం రాత్రి టీ నోట్‌కు కేబినెట్ పచ్చజెండా ఊపడంతో టీఆర్ఎస్, తెలంగాణవాదులు కుండపోతగా వర్షం కురిసినాజై తెలంగాణ నినాదాలు చేస్తూ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కట్ట వెంకటేశ్, తెలంగాణ వాదులు కొండు జనార్దన్, బొలిశెట్టి గంగన్న, సత్యం, లిగారెడ్డి,పెంట జలపతి పాల్గొన్నారు. భైంసా బస్టాండ్‌లో గురువారం రాత్రి టీ నోట్ ఓకే అవడంతో తెలంగాణవాదులు టసాసులు పేల్చారు. నృత్యాలు చేస్తూ తెలంగాణ నినాదాలు చేశారు. సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణాగౌడ్, నాయకులు నాగ్నాథ్, నరేశ్, రాజు ఉన్నారు. అంబరాన్నంటిన ‘తెలంగాణ’ సంబరాలు హైదరాబాద్‌సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర కేబినేట్ టీ-నోట్ విడుదల చేయడంతో జిల్లాలో గురువా రం నిర్వహించిన సంబరాలు అంబరాన్నింటాయి. తెలంగాణవాదులు బ్యాండుమేళాలు, డప్పు వాయిద్యాల మధ్య వర్షంలో సైతం నృత్యాలు చేస్తూ భారీగా టపాసులు పేల్చి ఒకరికొకరు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఏన్నాళ్లో వేచి చూస్తున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం కీలక ప్రకటన చే యడంపై అడుగడుగునా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నాలు గు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇన్నాళ్లకు తీరిందంటూ తెలంగాణవాదులు ‘జై తెలంగాణ’ నినాదాలతో ఊరేగింపులు నిర్వహించారు. టీ-నోట్ ప్రకటనకు ముందు సుమారు రెండు గంటలపాటు జరిగిన కేబినేట్ సమావేశం పైనే చర్చ జరిగింది. గురువారం ఉదయం నుంచే చాలా మంది తెలంగాణవాదులు ఉత్కంఠగా టీవీలకు అతుక్కుపోయారు. ఎట్టకేలకు సీడబ్ల్యూసీ తీర్మానాన్ని సమర్ధిస్తూ కేంద్ర కేబినేట్ 60 రోజుల తర్వాత హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రకటించడంతో జిల్లాలో సంబరాలు నిర్వహించారు. -
అట్టుడికిన జిల్లా
టీనోట్ నేపథ్యంలో ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు కదంతొక్కారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులు వందలాది మంది జిల్లా పరిషత్ నుంచి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ కృష్ణదేవరాయల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజ్‌విహార్ సెంటర్లో మానవహారం నిర్మించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగులు, మునిసిపల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్లో ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించి పట్టణ బంద్ పాటించారు. ఆదోనిలో సమైక్య రాష్ట్ర పరిక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పాతబస్టాండ్ కూడలి వద్ద పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో చేనేత మహిళలు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద విద్యార్థులు ఉపవాస దీక్ష చేపట్టారు. నంద్యాల మండలం శివపురంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రైతులు దీక్ష చేశారు. 300 తప్పెట్లతో మాదిగపేట వాసులు ర్యాలీ నిర్వహించారు. విద్యుత్‌శాఖ, నీటి పారుదల శాఖ ఆద్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. హొళగుందలో ఉపాధ్యాయులు శ్రమదానం చేశారు. ప్యాపిలి, వెల్దుర్తిలో జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. ఆత్మకూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటి వద్ద రిలే నిరాహార దీక్షలను ప్రారంభించి నిరసన వ్యక్తం చేశారు. సత్వరమే మంత్రి తమ పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ వద్ద కూర్చొని నిరసన తెలిపారు. వెలుగోడులో పొట్టి శ్రీరాములు సెంటర్లో సింహగర్జన సదస్సు నిర్వహించారు. బనగానపల్లెలో సమైక్యాంధ్రకు మద్దతుగా యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం బస్తాలు మెస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో రోడ్డుపై వ్యాయామం నిర్వహించారు. కొలిమిగుండ్ల మండలంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై భజన చేశారు. పత్తికొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులు రాస్తారోకో చేపట్టారు. - న్యూస్‌లైన్, కర్నూలు(కలెక్టరేట్) -
చీకటి నిరసన
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: టీనోట్ ఆమోదానికి నిరసనగా శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని నిలుపుదల చేసి చీకటి నిరసన తెలిపేందుకు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.ఉమాపతి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం స్థానిక విద్యుత్ భవన్‌లోని అతిథి గృహంలో జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం సరికాదన్నారు. నోట్‌కు నిరసనగా ప్రజలు స్వచ్ఛందంగా విద్యుత్ సరఫరా వినియోగాన్ని నిలిపేయాలన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని ఆయన పిలుపునిచ్చారు. విభజన కారణంగా తలెత్తే విద్యుత్ కష్టాల దృష్ట్యా ప్రతి వినియోగదారుడు ఈ నిరసనకు సహకరించాలన్నారు. -
72 గంటలు బంద్
రెండు నెలల ఉద్యమాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా టీనోట్‌ను ఆమోదించడం పట్ల జిల్లా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. గురువారం ఉదయం నుంచే టీనోట్ కేబినెట్ ముందుకు రాబోతుందన్న విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సమైక్యవాదులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. కర్నూలులో రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆత్మకూరులో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇళ్లను ముట్టడించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక కేబినెట్ టీనోట్‌కు ఆమోదముద్ర వేసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా అన్ని జేఏసీల ప్రతినిధులు ఉద్యమ తీవ్రతకు నిర్ణయించాయి. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి 72 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి. విభజనపై మొదటి నుంచి ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనూ బంద్ చేపడుతున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌ను విజయవంతం చేయాలని వారు కోరారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి నేతృత్వంలో జాతీయ రహదారిని దిగ్భంధించారు. ఎమ్మిగనూరులో కాంగ్రెస్, టీడీపీ దీక్షా శిబిరాలను సమైక్యవాదులు తొలగించేశారు. డోన్‌లో రైల్వే పట్టాలపై టైర్లకు నిప్పంటించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల దిష్టిబొమ్మలను తగులబెట్టారు. వెల్దుర్తి వద్ద జాతీయ రహదారిపై ధర్నా చేపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. కర్నూలు కలెక్టరేట్ కూడలిలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. రాస్తారోకో నిర్వహించి టైర్లకు నిప్పు పెట్టడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధులు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తును పటిష్టం చేశారు. - సాక్షి ప్రతినిధి, కర్నూలు