సాక్షి, కడప : టీ.నోట్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదముద్ర వేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల ఆందోళనలో భాగంగా రెండవరోజు శనివారం బంద్ విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ శ్రేణులకు అన్ని వర్గాల నుంచి సంఘీభావం లభించింది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎక్కడికక్కడ టైర్లు, మొద్దులు, కంపచెట్లు కాల్చి వేస్తూ రహదారులను దిగ్బంధం చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆస్పత్రులు, మెడికల్ దుకాణాలు సైతం మూతపడ్డాయి. తోపుడు బండ్లు, ఆటోలు సైతం తిరగలేదు.
కడపలో నియోజకవర్గ సమన్వయకర్త అంజాద్‌బాషా మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు నేతృత్వంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి బంద్‌ను పర్యవేక్షించారు. వందలాది మంది కార్యకర్తలు మోటారు బైకులతో ర్యాలీగా తిరుగుతూ బంద్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు బంద్‌కు పూర్తిస్థాయిలో సహకరించడంతో జనజీవనం స్తంభించింది. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో బండి ప్రసాద్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు.
జమ్మలమడుగులో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత హనుమంతరెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. ఎర్రగుంట్లలో జగన్ దీక్షకు మద్దతుగా గోపాల్‌రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు.
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో బి.కోడూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత ఓ.ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలను విరమింపజేశారు. సోనియా, రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మలను శవపేటికలో పెట్టి శవయాత్ర నిర్వహించి దహన సంస్కారాలు నిర్వహించారు. బద్వేలు మున్సిపాలిటీ, గోపవరం, అట్లూరు మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలతో కలిసి వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డీసీ గోవిందరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. బంద్‌ను పర్యవేక్షించారు.
రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మనందరెడ్డి నేతృత్వంలో ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసి వేయించారు. మైనార్టీ నాయకుడు మస్తాన్ నేతృత్వంలో ఐదుగురు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సంఘీభావం తెలిపి బంద్‌ను పర్యవేక్షించారు.
ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో 30 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు పట్టణంలో కలియ తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు.
రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వాహనంలో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. నల్లదిమ్మాయపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత జి.వెంకట సుబ్బారెడ్డి నేతృత్వంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు.
మైదుకూరులో వైఎస్సార్‌సీపీ నేతలు మదీన దస్తగిరి, షౌకత్ అలీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నాలుగురోడ్ల కూడలిలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. బంద్‌ను పర్యవేక్షించారు.
కమలాపురం పట్టణంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి మండల పార్టీ కన్వీనర్ ఉత్తమారెడ్డి నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. క్రాస్‌రోడ్డులో బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. పూర్తి స్థాయిలో బంద్ కొనసాగింది. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సావిత్రమ్మ నేతృత్వంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
పులివెందులలో వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నేతృత్వంలో ఎర్రిపల్లి, అచ్చువెల్లి గ్రామాలకు చెందిన 100 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దేవిరెడ్డి శిశవంకర్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు.
రాయచోటి పట్టణంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణమంతా కలియదిరుగుతూ బంద్‌కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బృందాలుగా ఏర్పడి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బంద్‌ను పర్యవేక్షించారు. 3, 4, 5 వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు మహబూబ్‌బాషా, జాకీర్ హుసేన్, అమీర్‌ఖాన్ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో..సమైక్య బంద్
Published Sun, Oct 6 2013 2:44 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement