టీనోట్ ఆమోదానికి నిరసనగా శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని నిలుపుదల చేసి చీకటి నిరసన తెలిపేందుకు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.ఉమాపతి పిలుపునిచ్చారు.
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: టీనోట్ ఆమోదానికి నిరసనగా శుక్రవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విద్యుత్ వినియోగాన్ని నిలుపుదల చేసి చీకటి నిరసన తెలిపేందుకు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎం.ఉమాపతి
పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం స్థానిక విద్యుత్ భవన్‌లోని అతిథి గృహంలో జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం సరికాదన్నారు. నోట్‌కు నిరసనగా ప్రజలు స్వచ్ఛందంగా విద్యుత్ సరఫరా వినియోగాన్ని నిలిపేయాలన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని ఆయన పిలుపునిచ్చారు. విభజన కారణంగా తలెత్తే విద్యుత్ కష్టాల దృష్ట్యా ప్రతి వినియోగదారుడు ఈ నిరసనకు సహకరించాలన్నారు.