సంగం తహసీల్దార్ కార్యాలయం
నెల్లూరు(పొగతోట): జిల్లాలో రెవెన్యూ శాఖలో తహసీల్దార్ల కొరత అధికంగా ఉంది. నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లు, 46 మండలాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది. బాలాయపల్లి, ఇందుకూరుపేట, రాపూరు, ఆత్మకూరు, సంగం, ఏఎస్‌పేట, కలిగిరి మండలాలు, రెండు ప్రత్యేక తహసీల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తహసీల్దార్లు లేని మండలాల్లో డీటీలను ఇన్‌చార్జిలుగా నియమించారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో రికార్డుల నిర్వహణ, ప్రజల సమస్యలు పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. పాసుపుస్తకాల మంజూరు, మీ–భూమికి భరోసా, ఓటర్ల జాబితా సిద్ధం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం డీపీసీ నిర్వహించి డీటీలకు పదోన్నతులు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా ఉందనే విమర్శలున్నాయి. డీపీసీ నిర్వహిస్తే జిల్లాకు తహసీల్దార్లను కేటాయించే అవకాశం ఉంది.
ఎన్నో సేవలు
మండల కేంద్రాల్లోని రెవెన్యూ కార్యాలయాలకు ప్రజలకు నిత్యం వెళుతుంటారు. ఆదాయం, నివాస, కుల, జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ భూములకు సంబం«ధించి అడంగళ్, వన్–బీ, రేషన్‌కార్డులు, పాసు పుస్తకాలు తదితర సేవలు తహసీల్దార్ నుంచి వారికి అందాల్సి ఉంటుంది. అ లాగే జిల్లాలో భూ సమస్యల పరి ష్కారం కోసం మీ భూమి భరోసా కా ర్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అధి కారుల కొరత కారణంగా ఈ కార్యక్రమం వేగవంతంగా సాగడం లేదు.
కొన్ని సంవత్సరాలుగా..
మండలాలు, డివిజన్లు, కలెక్టరేట్, స్పెషల్ పోస్టులకు మొత్తం 67 మంది తహసీల్దార్ల అవసరం ఉంది. 46 మం దిని నియమించాల్సి ఉంది. కలెక్టరేట్‌లో ఎనిమిది మంది, రెవెన్యూ డివి జన్లకు ఐదుగురు డీఏఓలు, తెలుగుగంగ, ఐటీడీఏ తదితర శాఖలో ఎని మిది స్పెషల్ తహసీల్దార్ పోస్టులు ఉ న్నాయి. గతేడాది ప్రకాశం జిల్లా నుం చి నలుగురు తహసీల్దార్లను జిల్లాలకు కేటాయించారు. వారిలో ముగ్గురు మాత్రమే బాధ్యతలు స్వీకరించారు.
8 లక్షలున్నాయి
భూ సమస్యలు 16.50 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో తహసీల్దార్లు పరి ష్కరించాల్సినవి 8 లక్షలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తే ఫైళ్ల నిర్వహణ వేగవంతం ఆయ్యే అవకాశాలు న్నాయి. కాగా తహసీల్దార్ల ఖాళీలను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇతర జిల్లాల నుంచి కేటాయించాలని చేయమని సీసీఎల్‌ఏకు నివేదికలు పంపించారు. గుంటూరు జి ల్లా నుంచి తొమ్మిదిమంది తహసీల్దార్ల ను జిల్లాలకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
డీపీసీ నిర్వహించాల్సి ఉంది
జిల్లాలో తహసీల్దార్ల కొరత ఉంది. ఈ క్రమంలో సీసీఎల్‌ఏకు నివేదికలు పంపించాం. త్వరలో ఇతర జిల్లా నుంచి తహసీల్దార్లను కేటాయించే అవకాశం ఉంది. ప్రభుత్వం డీసీపీ నిర్వహించాల్సి ఉంది. ఫైళ్లు పెండింగ్ లేకుండా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నాం. – వి.వెంకటసుబ్బయ్య, డీఆర్వో
Comments
Please login to add a commentAdd a comment