
సాక్షి, రాజంపేట(కడప) : పద కవితా పితామహుడు అన్నమాచార్యులు జన్మస్థలం తాళ్లపాక. ఆయన తమ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ, సిద్దేశ్వరస్వాములను ఆరాధించేవారు. ఆ స్వాముల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. జూలై 11న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మపరిషత్ వారిచే హరికథ, సంగీత, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 12న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి చిన్నశేషవాహనసేవ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment