Brahmostavalu
-
‘సమిష్టి కృషి, సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం’
సాక్షి, తిరుపతి: సమిష్టి కృషి, సమన్వయంతో శ్రీవారి సాలకట్ల మరియు నవరాత్రి రెండు బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం స్థానిక అన్నమయ్య భవనంలో భూమన కరుణాకరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు..శ్రీవారి కృపతోనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశామని... భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వాహన సేవల్లో ఉత్సవాలు చేసిన భక్తులు మధురానుభూతి పొందారన్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లోనే టీటీడీ ఉద్యోగుల కల నెరవేరిందని, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగులకు ఇంటి స్టలాలను అందాజేశామన్నారువాహన సేవల ముందు కళ బృందాలు గొప్పగా తమ ప్రదర్శనలు చేశాయని,15 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కళా బృందాలు భక్తులను అలరించాయన్నారు. ఉత్సవాలు ఘన విజయం కావడానికి శ్రమించిన ప్రతిఒక్కరికి చైర్మన్ అభినందనలు తెలియజేశారు. హిందూ ధార్మిక వ్యాప్తి, హైందవ ప్రజాహితం కోసం టీటీడీ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. -
బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సీఎం జగన్ ( ఫొటోలు)
-
ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. ►అమ్మవారి ఆలయంలో సీఎం జగన్ ప్రత్యేక పూజలు ► సీఎం జగన్‌కు అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేసిన దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. ► అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ► ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం జగన్ తలకు పరివేష్టం చుట్టిన ఆలయ అర్చకులు. ► పూర్ణకుంభంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికిన ఆలయ అధికారులు ► పంచెకట్టులో అమ్మవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ► ఇంద్రకీలాద్రి చేరుకున్న సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ. -
హంస వాహనాధీశా.. హరోం హర
సాక్షి, శ్రీశైలం: శ్రీగిరి కొండలు శివ నామస్మరణతో ప్రతిధ్వనిస్తుండగా.. శ్రీశైల క్షేత్రం బ్రహ్మోత్సవ కాంతులతో కళకళ లాడుతుండగా.. దేవేరి భ్రామరితో కలసి మల్లన్న మందస్మిత దరహాస వీచికలతో హంస వాహనంపై కనులపండువగా దర్శనమివ్వగా.. హంస వాహనాధీశా.. హరోం.. హర అంటూ శివ స్వాములు ప్రణమిల్లారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు ఆదివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునస్వామి హంస వాహనంపై విశేష వాహన పూజలు అందుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం వద్ద ఉన్న అక్కమహాదేవి అలంకార మండపంలో రాత్రి 7.30 గంటలకు హంస వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకార పూజలు, వాహన, వింజామర సేవలను వేదమంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు, వేదపండితులు పండితులు నిర్వహించారు. మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా, భక్తులు పంచాక్షరి నామస్మరణ చేస్తున్న సమయాన హంసవాహనాధీశులైన స్వామివార్లను ఆలయ ప్రదక్షిణ చేయించి ఆలయప్రాకార ప్రధాన రాజగోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రధాన పురవీధిలోని అంకాలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం జరిగింది. అక్కడి నుంచి నేరుగా స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాంగణం చేరుకుంది. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కనులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలనర్పించారు. శివరాత్రి రోజు జరిగే బ్రహ్మోత్సవ కల్యాణానికి మొదటిసారిగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరపున ఈఓ సురేష్‌బాబు దంపతులు ఆదివారం రాత్రి పట్టువస్త్రాలను సమర్పించారు. స్వామి అమ్మవార్లకు ఫలపుష్పాదులు, పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ, గాజులుతో కూడిన పళ్లాలను తలపై పెట్టుకుని ఆలయప్రదక్షిణ చేసి సమర్పించారు. నేడు శ్రీశైలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను మయూర వాహనంపై ఉంచి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజలు చేస్తారు. వాహన సమేతులైన స్వామిఅమ్మవార్లను రథశాల నుంచి నందిమండపం, అంకాలమ్మ గుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగిస్తారు. కాగా సోమవారం జరిగే ప్రత్యేక పూజల్లో భాగంగా ఉదయం 7.30 గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్టానములు, నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి నిత్యపూజలు చేపడతారు. టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పణ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కల్యాణమూర్తులకు సోమవారం తిరుమల, తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. గత కొన్నేళ్లుగా టీటీడీ దేవస్థానం తరపున శ్రీశైలంలో జరిగే శివరాత్రి, దసరా ఉత్సవాలకు పట్టువస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కళా నీరాజనం బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామోత్సవంలో కళాకారుల అమోఘంగా తమ కళలను ప్రదర్శించడంతో భక్తులు పులకించిపోయారు. తప్పెట చిందులు, కోలాటం, డోలు కళాకారుల విన్యాసాలు, చెంచు గిరిజనుల నృత్యప్రదర్శన, గొరవయ్యల ఈల పాటల నృత్యాలు, కేరళ నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలన్ని భక్తులను తమ అలసటను మరిచిపోయేలా చేశాయి. -
తాళ్లపాక తళతళ
సాక్షి, రాజంపేట(కడప) : పద కవితా పితామహుడు అన్నమాచార్యులు జన్మస్థలం తాళ్లపాక. ఆయన తమ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ, సిద్దేశ్వరస్వాములను ఆరాధించేవారు. ఆ స్వాముల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 12 నుంచి 20 వరకు జరగనున్నాయి. జూలై 11న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధర్మపరిషత్ వారిచే హరికథ, సంగీత, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై 12న ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి చిన్నశేషవాహనసేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
వైభవంగా ధ్వజారోహణం.. ఆకర్షిస్తోన్న సైకత శిల్పం
సాక్షి, తిరుమల : ఈ ఏడాది రెండు పర్వదినాలు ఒకే రోజున వచ్చాయి. వాటిలో విఘ్నాల్ని తొలగించి, విజయాల్ని అనుగ్రహించే దైవం వినాయకుని పుట్టినరోజు ఒకటి కాగా.. మరోటి ముక్కోటి దేవతలు, ముల్లోకాలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజే ప్రారంభమయ్యాయి. బ్రహ్మాత్సావాల్లో భాగంగా ఈ ఏడాది తొలి పూజలు గణనాథుడే అందుకున్నాడు. ఏటా ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది అధికమాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. తొలి ఉత్సవాలు నేడు ప్రారంభమవుతుండగా.. 20 రోజుల తేడాతో శరన్నవరాత్రి సందర్భంగా మరోసారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం నిర్వహించే సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 - 6. 30 గంటల ప్రాంతంలో మకర లగ్నంలో ధ్వజరోహణ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇందులో భాగంగా ధ్వజ స్తంభంపై జెండాను ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలకుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామీవారు పెదశేష వాహనంపై ఊరేగుతారు. భక్తులను ఆకర్షిస్తోన్న సైకత శిల్పం బ్రహ్మోత్సవాల సందర్భంగా విష్ణుమూర్తి దశవతారాలలోని ఒక్కో అవతారాన్ని ఏడాదికి ఒకటి చోప్పున సైకత శిల్పంగా రూపొందించి ఉత్సవాలకు అదనపు హంగులు అద్దుతున్నారు మైసూర్‌కు చెందిన ఇద్దరు అక్కచెళ్లల్లు. వారి వివరాలు.. కర్ణాటకకు చెందిన నీలాంభిక తన సోదరి గౌరితో కలిసి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత ఏడేళ్ల నుంచి పాప నాశనం వెళ్లే దారిలో ఫలపుష్ప ప్రదర్శన శాలలో ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నారు. టీటీడీ గార్డెన్ ఇన్చార్జ్ శ్రీనివాస్ సహకారంతో ఈ శిల్పాలను తయారు చేస్తున్నట్లు నీలాంభిక తెలిపారు. మూడు రోజులపాటు శ్రమించి ఈ సైకత శిల్పాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికవరకూ వరాహ, ఉగ్ర నరసింహ, మత్స్య అవతారాలను సైకత శిల్పంగా చెక్కినట్లు తెలిపారు. ఈ ఏడాది వామన అవతారాన్ని రూపొందించామన్నారు. ఇందుకుగాను 9 టన్నుల ఇసుకను వాడినట్లు తెలిపారు. దేశం మొత్తం మీద ఇద్దరే... దేశంలో సైకత శిల్పాలను రూపొందిస్తున్న మహిళా కళాకారులు వీరిద్దరు మాత్రమే ఉండటం గమనార్హం. వీరు మన దేశంలోనే కాక అరబ్ దేశంలో కూడా సైకత శిల్పాలాను రూపొందించినట్లు తెలిపారు. అరబ్ దేశంలో నిర్వహించే ఒంటేల పండుగ సందర్భంగా అరబ్ దేశాల సంస్కృతిని ప్రతిబింబించేలా సైకత శిల్పాలను రూపొందించినట్లు నీలాంభిక తెలిపారు. ఈ కళను నేర్చుకోవడం కోసం తాము ఎవరి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని.. ఇంటర్నెట్లో చూసి ఈ సైకత శిల్పాలలను మలచడం నేర్చుకున్నట్లు నీలాంభిక తెలిపారు. -
ముగిసిన బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ముగి శాయి. ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో తొమ్మిది రోజుల పాటు సాగిన ఉత్సవాలకు వీడ్కోలు పలికారు. సమైక్యాంధ్ర ఉద్యమ సెగలోనూ భక్తులు అష్టకష్టాలు పడి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈసారి నూతన స్వర్ణరథం ఊరేగింపు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అశేష జనవాహిని మధ్య చక్రస్నానం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు కన్యామాసం(అధిక భాద్రపదం) ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం పవిత్రముహూర్తాన చక్రస్నానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుష్కరిణి ఒడ్డున ఉన్న వరాహస్వామి ఆలయ ఆవరణలో సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఉభయ దేవేరులతో సహా మలయప్పస్వామికి స్నపన తిరుమంజన(సుగంధ ద్రవ్యాలతో అభిషేకం) కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత మంగళధ్వనులు, పండితుల వేద ఘోష, అశేష భక్తజనుల గోవింద నామస్మరణ మధ్య గర్భాలయంలోని మూలమూర్తి అంశమైన సుదర్శన చక్రతాళ్వార్‌కు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయం నుంచి సూర్యాస్తమయం వరకు పుష్కరిణిలో పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తొలగుతాయని పురాణ ప్రశస్తి. ఇందులో భాగంగా ఆదివారం వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేశారు. ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవం తొమ్మిది రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ధ్వజపటాన్ని అవరోహణం చేసి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. స్వర్ణరథమే ప్రత్యేక ఆకర్షణ ఈసారి బ్రహ్మోత్సవాలకు స్వర్ణరథమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా రూ.25 కోట్లతో అతి పెద్ద స్వర్ణరథాన్ని టీటీడీ ఇంజినీర్లు తయారు చేశారు. ప్రయోగాత్మక పరిశీలనలో అనేక అవాంతరాలు వచ్చినా వాటిని తొలగించడంతో అధికార్లు, ఇంజినీర్లు సఫలీకృ తులయ్యారు. నిర్ణయించిన శుభముహూర్తంలోనే విజయవంతంగా కొత్త స్వర్ణరథాన్ని ఊరేగించి భక్తులను ఆనందడోలికల్లో ముంచెత్తారు. మిగిలిన వాహన సేవల్లో భక్తులు పలుచగా కనిపించినా గరుడ సేవ రోజు సుమారు రెండున్నర లక్షల మంది స్వామిని దర్శించుకోవడం విశేషం. 4.48 లక్షల మందికి శ్రీవారి దర్శనం ఈసారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిది రోజుల్లో 4,48,416 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్టు టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ తెలిపారు. గతేడాది వార్షిక ఉత్సవాల కంటే ఈసారి 5.47 శాతం తక్కువని ఈవో వెల్లడించారు. గత ఏడాది శ్రీవారి హుండీద్వారా రూ.12.9 కోట్లు రాగా ఈసారి రూ.12 కోట్లమేర కానుకలందాయన్నారు. గత ఏడాది 2 లక్షలా 34 వేల మంది తలనీలాలు సమర్పించగా ఈసారి 2 లక్షలా 23 వేల మంది ఇచ్చారు. జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఉత్సవాలు ఘనంగా ముగిశాయన్నారు. కాలిబాట భక్తులకు ఉచిత లడ్డూ: బాపిరాజు అందరి సహకారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు విలేకరులకు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో కాలినడకన వచ్చిన భక్తులకు తొమ్మిది రోజుల్లో లక్షా అరవై వేల లడ్డూలు ఉచితంగా అందజేశామన్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసంలోనూ అన్నప్రసాదం (ఉచిత భోజనం) అందించే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఆగమ కైంకర్యంతో అనుబంధం ఉన్న శ్రీవారికి వెండి రథం తయారు చేస్తామని తెలిపారు.