లారీని ఢీకొట్టిన టాటా మ్యాజిక్ | tata magic -lorry accident in national highway | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన టాటా మ్యాజిక్

Published Fri, Mar 14 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

లారీని ఢీకొట్టిన టాటా మ్యాజిక్

లారీని ఢీకొట్టిన టాటా మ్యాజిక్

 ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్  : లారీని వెనుక నుంచి టాటా మ్యాజిక్ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏలూరు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇరగవరం మండలం కాకిలేరు గ్రామానికి చెందిన ఆసు వేద సాయినాథ్(22) మూడు నెలలుగా పెనుగొండలోని ఓ వ్యక్తికి చెందిన టాటా మ్యాజిక్ వాహనంపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
 
 గురువారం రాత్రి విజయవాడలో బియ్యం లోడు చేసుకుని తాడేపల్లిగూడెం బయల్దేరాడు. ఏలూరు జాతీయ రహదారిపై రత్నాస్ హోటల్ వద్దకు వచ్చేసరికి కోళ్ల దాణా లోడుతో వెళుతున్న లారీకి ఒక్కసారిగా బ్రేక్ పడడంతో వెనుక వస్తున్న టాటా మ్యాజిక్ లారీని ఢీకొంది. ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ వేద సాయినాథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై జి.ఫణేంద్ర, రైటర్ హమీద్ ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీని సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement