మానవపాడు(అలంపూర్) : ఆగివున్న లారీని ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ సంఘటన 44వ జాతీయ రహదారి మానవపాడు క్రాస్‌రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన సాయికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 32 మంది ప్రయాణికులతో తిరుపతికి బయల్దేరింది. మానవపాడు క్రాస్‌రోడ్డు సమీపంలోకి రాగానే రోడ్డుపై ఆగిఉన్న లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్ రషీద్ క్యాబిన్‌లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడున్న వారు అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. బస్సు ముందు భాగంలో ఉన్న అద్దాన్ని ధ్వంసం చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు
Published Mon, Sep 25 2017 1:46 PM | Last Updated on Mon, Sep 25 2017 1:46 PM
Advertisement
Advertisement