tata magic
-
AP: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కాకినాడ: గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 9 మంది గాయపడ్డారు. దీంతో, స్థానికులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ప్రమాదం తాడేపల్లిగూడెం నుండి వైజాగ్ వెళ్తుండగా జరిగింది. -
పచ్చని చెట్టు పొట్టన పెట్టుకుంది
ఖానాపూర్: జలపాతం చూసేందుకు మిత్రులంతా కలిసి బయల్దేరిన విహార యాత్ర విషాద యాత్రగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై చెట్టు కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన 12 మంది మిత్రులు ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండ మండలం కుంటాల జలపాతాన్ని చూసేందుకు టాటా మ్యాజిక్ వాహనంలో ఉదయం బయల్దేరారు. ఖానాపూర్ మండలం ఎక్బాల్‌పూర్ వద్దకు రాగానే వీరి వాహనంపై రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం కూలింది. ఆ సమయంలో వాహనంలో డ్రైవర్‌తో కలిపి 13 మంది ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ వంతడుపుల బుచ్చిరాం (49), ఉట్నూర్ రవి (35) అక్కడికక్కడే మృతి చెందారు. పందిరి నిఖిల్‌కు తీవ్రంగా, మిగిలిన పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనం మధ్యలో చెట్టు పడి ఉంటే ప్రాణనష్టం ఇంకా ఎక్కువ జరిగేదని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదుకోని ఆపద్బంధువు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కత్తిపూడి శివారు 216వ జాతీయ రహదారి పక్కన ఇటీవల 108 సేవలు సకాలంలో అందకపోవడంతో నడిరోడ్డుపైనే మతి స్థిమితం లేని మహిళ ప్రసవించింది. ఫోన్ చేసినా సకాలంలో 108 రాకపోవడంతో జన్మించిన శిశువుకు వైద్యం అందలేదు. దీంతో శిశువు వెంటనే కన్నుమూసింది. ఘటన జరిగిన 3 గంటల తర్వాత 108 వాహనం అక్కడికి చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోమవారం కూడా అదే తరహా జాప్యం పునరావృతమైంది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో టాటా మేజిక్ వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయగా వెంటనే రాలేదు. ఫోన్ చేసిన 2 గంటల తర్వాత వాహనం చేరుకుంది. ఈలోపు తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందారు. 108 వచ్చేలోపు పోలీసు జీపు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. ఇలా చెప్పుకునిపోతే గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కానీ, ప్రభుత్వంలో చలనం లేదు. వైఎస్సార్ హయాంలో ఎన్నో ప్రాణాల్ని కాపాడిన ఆపద్బంధువు ఇప్పుడేమాత్రం ఆదుకోలేకపోతోంది. ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత గానీ రాని పరిస్థితి నెలకొంది. ఈలోపే క్షతగాత్రులు, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒకప్పుడు ప్రథమ చికిత్సతోప్రాణాల్ని నిలబెట్టేవి. తదుపరి వైద్యసేవలు అందేవరకు మెరుపు వేగంతో తరలి వచ్చి పునర్జన్మ ప్రసాదించేవి. ఇప్పుడా పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. సమయానికి రాకపోగా, వచ్చేవి కూడా ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితిలో 108 ఉంది. ఆక్సిజన్ కూడా 108 వాహనాల్లో లేని దుస్థితి నెలకొంది. జిల్లాలో 42 వాహనాలుండేవి. ఇందులో ప్రస్తుతం 33 పని చేస్తున్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికైతే క్షేత్రస్థాయిలో 29 మాత్రమే తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మిగతా వన్నీ మూలకు చేరిపోయాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వాటిలో 20 వరకు చిన్న,చిన్న మరమ్మతులతో ఉన్నాయి. ఎప్పుడేది ఆగిపోతుందో తెలియదు. ఇక, ఆక్సిజన్ లేక, ఇంజన్ ఆయిల్ మార్చక, టైర్లు ఆరిగిపోయి తిరుగుతున్న వాహనాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాస్తవ పరిస్థితి బయటకు చెబితే ప్రభుత్వం కన్నెర్ర చేస్తుందని అధికార వర్గాలు బయటికి చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 108 వాహనాలు వచ్చి ఆదుకుంటాయనే ఆశ ప్రజలకు లేకుండా పోయింది. అందుకు ఉదాహరణే తాజాగా గొల్లప్రోలు వద్ద జరిగిన ప్రమాదం. కత్తిపూడిలో అదే నిర్లక్ష్యం... మొన్న కత్తిపూడిలో ఫోన్ చేసిన 3 గంటల తర్వాత 108 వాహనం రావడంతో రోడ్డుపై మతి స్థిమితం లేని మహిళ జన్మనిచ్చిన శిశువు చనిపోగా సోమవారం చేబ్రోలులో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సేవలందించే విషయంలో కూడా అదే తరహా జాప్యం చోటుచేసుకుంది. దీనికంతటికీ ప్రమాదం జరిగిన గొల్లప్రోలు మండలంలో 108 వాహనం లేకపోవడమే కారణం. గతంలో ఇక్కడ 108 వాహనం ఉండేది. కాకినాడ రూరల్‌లోని వాహనం పాడైందని గొల్లప్రోలులో ఉండే వాహనాన్ని తరలించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గమంతటికీ రెండే వాహనాలున్న పరిస్థితి నెలకొంది. అసలే అరకొరగా పనిచేస్తుండగా, ఆపై వాహన కొరత ఉండటంతో ఫోన్ చేసిన వెంటనే ఘటన జరిగిన చేబ్రోలుకు 108 రాలేకపోయినట్టు తెలుస్తోంది. సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరగ్గా 108 వచ్చే సరికి రెండు గంటలు ఆలస్యమైంది. ఈలోపే తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సకాలంలో వైద్యసేవలందక మృతి చెందారు. సమయానికి వచ్చి ఉంటే వారిద్దరూ బతికేవారేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలను పణంగా పెట్టక తప్పదన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జాప్యానికి కారణంపరిశీలిస్తా... ఫోన్ చేసిన వెంటనే 108 వాహనం ఎందుకు రాలేకపోయిందో పరిశీలిస్తాను. ఏ కారణం చేత రాలేదో తెలుసుకుంటాను. కాకినాడ రూరల్ 108 వాహనం చెడిపోయిన కారణంగా గొల్లప్రోలు వాహనాన్ని అక్కడికి తరలించాం. 108 వాహనాల కొరత ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వాహనాలు రానున్నాయి.– బాలాజీ, 108 సేవల జిల్లా మేనేజర్ -
రక్తమోడిన రోడ్లు
జిల్లాలో శుక్ర, శనివారాల్లో నాలుగు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఆరు గురు మృతిచెందారు. కొత్తగూడెం మండలండేగులమడుగు గ్రామం సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు, ఆరేళ్ల బాలుడు, జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా పంచాయతీలోని పెద్దతండా గ్రామంలో జరిగిన ప్రమాదంలో ఒకరు, టేకులపల్లి మండ లం బేతంపూడి పంచాయతీలోని వెంకట్యాతండాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు, చింతకాని మండలం వందన గ్రా మం వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఆటోను ఢీకొన్న లారీ : యువకుడు, చిన్నారి మృతి కొమ్ముగూడెం (జూలూరుపాడు): కొమ్ముగూడెం గ్రామ సమీపంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధానరహదారిపై శనివారం రాత్రి ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు, ఆరేళ్ల చిన్నారి మృతిచెందారు. కాకర్ల గ్రామానికి చెందిన అప్పి ఆటో డ్రైవర్ బండారి అయోధ్య(31) ఇంటికి, కారేపల్లిలో ఉంటున్న అతని చెల్లెలు ముత్తినేని మాధవి, మేనల్లుడు రిషిత్(6) దసరా పండగ కోసం వచ్చారు. అయోధ్య శనివారం ఆటోలో కొత్తగూడెం బయల్దేరుతుండగా.. తాను కూడా వస్తానంటూ మేనల్లుడు రిషిత్ వెంటబడ్డాడు. దీంతో, ఆ చిన్నారిని తన ఆటోలో కూర్చోబెట్టుకుని అయోధ్య వెళ్లాడు. కొత్తగూడెం మండలంలోని డేగులమడుగు గ్రామం సమీపంలో ఈ ఆటోను కొత్తగూడెం వైపు నుంచి తల్లాడ వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బండారి అయోధ్య, రిషిత్ అక్కడక్కడే మృతిచెం దారు. అయోధ్యకు భార్య, రిషిత్‌కు తల్లిదండ్రులు ముతినేని వెంకట్రావు, మాధవి, తమ్ముడు ఉన్నారు. రిషిత్, అతని తల్లిదండ్రులు, తమ్ము డు కలిసి శనివారం ఉదయం పెనుబల్లి మండలంలోని నీలాద్రి శివాలయానికి వె ళ్లారు. రిషిత్ తల వెంట్రుకలు ఇచ్చి మొ క్కలు తీర్చుకుని సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆ కొద్దిసేపటికే, రుషిత్తో కలి సి అయోధ్య ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో అయోధ్య భార్య, రిషిత్ తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ, బంధువులు గుండెల విసేలా రోదించారు. కాకర్ల గ్రామంలో వి షాధ ఛాయలు అలుముకున్నాయి. ప్ర మాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. టాటా మేజిక్ ఢీకొని ఇద్దరు మృతి బేతంపూడి (టేకులపల్లి): బేతంపూడి పంచాయతీలోని వెంకట్యాతండాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఎస్ఐ బత్తుల సత్యనారాయణ తెలిపిన ప్రకారం... వెంకట్యాతండాకు చెందిన రైతు దంపతులు బోడ కిషన్, మాల్కి కలిసి తంగెళ్ళతండా సమీపంలోని తమ పొలానికి కాలి నడకన బయల్దేరారు. కొంచెం దూరం వెళ్లగానే.. అదే గ్రామానికి చెందిన రైతు అంగోతు మంగ్య ద్విచక్ర వాహనంపై వెళుతూ, వీరిని చూసి ఆగాడు. వారిద్దరినీ తన బైక్‌పై ఎక్కించుకుంటుండడగా, కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపుకు వేగంగా వచ్చిన టాటా మేజిక్ ఢీకొంది. బోడ కిషన్, బోడ మాల్కి, అంగోతు మంగ్య తీవ్ర గాయాలతో దూరంగా పడిపోయారు. ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బోడ మాల్కి(40) మృతిచెం దాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంగోతు మంగ్య(38) మృతిచెందాడు. బోడ కిషన్ చికిత్స పొం దుతున్నాడు. కిషన్-మాల్కి దంపతులకు పిల్లలు ఉన్నారు. మంగ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇల్లెందు ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. టాటా మేజిక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. మోటార్ సైకిల్ బోల్తాపడి ఒకరు... మాచినేనిపేటతండా (జూలూరుపాడు): మాచినేనిపేట తండా పంచాయతీలోని పెద్దతండా గ్రామంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్ఐ ఎన్.గౌతమ్ తెలిపిన ప్రకారం.. కొత్తగూడెం మండలం రుద్రంపూర్‌కు చెందిన వెంకటేశ్వరరావు(48) ఖమ్మం నుంచి రుద్రపూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పెద్దతండా గ్రామం వద్ద కుక్క అడ్డొచ్చింది. దానిని తప్పించే ప్ర యత్నంలో ద్విచక్ర వాహనం అదుపు త ప్పి పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఎస్ఐ ఎన్.గౌతమ్ చేర్పించా రు. ఆస్పత్రిలో వెంటేశ్వరరావు మృతిచెం దాడు. అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ కేసు నమోదు చేశారు. రెండు మోటార్ సైకిళ్లు ఢీకొని ఒకరు... వందనం (చింతకాని): రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఏఎస్సై ప్రభాకర్‌రావు తెలిపిన ప్రకారం... బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన ఏదుళ్ల నాగరాజు(25), దస రా పండుగకని తన అత్తగారి గ్రామమైన వందనం గ్రామానికి వచ్చాడు. అతడు, తన బావమరిది శివరామకృష్ణతో కలిసి శుక్రవారం సాయంత్రం మోటార్ సైకిల్‌పై ఊరి చివరిలోగల శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుం డగా, కొదుమూరు గ్రామానికి చెందిన దంతలపల్లి నాగేశ్వరరావు నడుపుతున్న మోటార్ సైకిల్ ఢీ కొంది. నాగరాజు, శివరామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్ తరలిస్తుండగా నాగరాజు మృతిచెం దాడు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శివరామకృష్ణ చికిత్స పొందుతున్నాడు. నాగరాజు కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నాగరాజుకు ఐదునెలల క్రితమే వివాహమైంది. -
లారీని ఢీకొట్టిన టాటా మ్యాజిక్
ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : లారీని వెనుక నుంచి టాటా మ్యాజిక్ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏలూరు సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇరగవరం మండలం కాకిలేరు గ్రామానికి చెందిన ఆసు వేద సాయినాథ్(22) మూడు నెలలుగా పెనుగొండలోని ఓ వ్యక్తికి చెందిన టాటా మ్యాజిక్ వాహనంపై డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విజయవాడలో బియ్యం లోడు చేసుకుని తాడేపల్లిగూడెం బయల్దేరాడు. ఏలూరు జాతీయ రహదారిపై రత్నాస్ హోటల్ వద్దకు వచ్చేసరికి కోళ్ల దాణా లోడుతో వెళుతున్న లారీకి ఒక్కసారిగా బ్రేక్ పడడంతో వెనుక వస్తున్న టాటా మ్యాజిక్ లారీని ఢీకొంది. ప్రమాదంలో టాటా మ్యాజిక్ డ్రైవర్ వేద సాయినాథ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై జి.ఫణేంద్ర, రైటర్ హమీద్ ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీని సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.