రక్తమోడిన రోడ్లు
జిల్లాలో శుక్ర, శనివారాల్లో నాలుగు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఆరు గురు మృతిచెందారు. కొత్తగూడెం మండలండేగులమడుగు గ్రామం సమీపంలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు, ఆరేళ్ల బాలుడు, జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా పంచాయతీలోని పెద్దతండా గ్రామంలో జరిగిన ప్రమాదంలో ఒకరు, టేకులపల్లి మండ లం బేతంపూడి పంచాయతీలోని వెంకట్యాతండాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు, చింతకాని మండలం వందన గ్రా మం వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
ఆటోను ఢీకొన్న లారీ : యువకుడు, చిన్నారి మృతి
కొమ్ముగూడెం (జూలూరుపాడు): కొమ్ముగూడెం గ్రామ సమీపంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధానరహదారిపై శనివారం రాత్రి ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు, ఆరేళ్ల చిన్నారి మృతిచెందారు. కాకర్ల గ్రామానికి చెందిన అప్పి ఆటో డ్రైవర్ బండారి అయోధ్య(31) ఇంటికి, కారేపల్లిలో ఉంటున్న అతని చెల్లెలు ముత్తినేని మాధవి, మేనల్లుడు రిషిత్(6) దసరా పండగ కోసం వచ్చారు. అయోధ్య శనివారం ఆటోలో కొత్తగూడెం బయల్దేరుతుండగా.. తాను కూడా వస్తానంటూ మేనల్లుడు రిషిత్ వెంటబడ్డాడు. దీంతో, ఆ చిన్నారిని తన ఆటోలో కూర్చోబెట్టుకుని అయోధ్య వెళ్లాడు. కొత్తగూడెం మండలంలోని డేగులమడుగు గ్రామం సమీపంలో ఈ ఆటోను కొత్తగూడెం వైపు నుంచి తల్లాడ వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బండారి అయోధ్య, రిషిత్ అక్కడక్కడే మృతిచెం దారు. అయోధ్యకు భార్య, రిషిత్‌కు తల్లిదండ్రులు ముతినేని వెంకట్రావు, మాధవి, తమ్ముడు ఉన్నారు.
రిషిత్, అతని తల్లిదండ్రులు, తమ్ము డు కలిసి శనివారం ఉదయం పెనుబల్లి మండలంలోని నీలాద్రి శివాలయానికి వె ళ్లారు. రిషిత్ తల వెంట్రుకలు ఇచ్చి మొ క్కలు తీర్చుకుని సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆ కొద్దిసేపటికే, రుషిత్‌తో కలి సి అయోధ్య ఆటోలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో అయోధ్య భార్య, రిషిత్ తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ, బంధువులు గుండెల విసేలా రోదించారు. కాకర్ల గ్రామంలో వి షాధ ఛాయలు అలుముకున్నాయి. ప్ర మాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
టాటా మేజిక్ ఢీకొని ఇద్దరు మృతి
బేతంపూడి (టేకులపల్లి): బేతంపూడి పంచాయతీలోని వెంకట్యాతండాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఎస్‌ఐ బత్తుల సత్యనారాయణ తెలిపిన ప్రకారం... వెంకట్యాతండాకు చెందిన రైతు దంపతులు బోడ కిషన్, మాల్కి కలిసి తంగెళ్ళతండా సమీపంలోని తమ పొలానికి కాలి నడకన బయల్దేరారు. కొంచెం దూరం వెళ్లగానే.. అదే గ్రామానికి చెందిన రైతు అంగోతు మంగ్య ద్విచక్ర వాహనంపై వెళుతూ, వీరిని చూసి ఆగాడు. వారిద్దరినీ తన బైక్‌పై ఎక్కించుకుంటుండడగా, కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపుకు వేగంగా వచ్చిన టాటా మేజిక్ ఢీకొంది. బోడ కిషన్, బోడ మాల్కి, అంగోతు మంగ్య తీవ్ర గాయాలతో దూరంగా పడిపోయారు. ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బోడ మాల్కి(40) మృతిచెం దాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అంగోతు మంగ్య(38) మృతిచెందాడు. బోడ కిషన్ చికిత్స పొం దుతున్నాడు. కిషన్-మాల్కి దంపతులకు పిల్లలు ఉన్నారు. మంగ్యకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇల్లెందు ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. టాటా మేజిక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
మోటార్ సైకిల్ బోల్తాపడి ఒకరు...
మాచినేనిపేటతండా (జూలూరుపాడు): మాచినేనిపేట తండా పంచాయతీలోని పెద్దతండా గ్రామంలో తల్లాడ-కొత్తగూడెం ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ
ఎన్.గౌతమ్ తెలిపిన ప్రకారం..
కొత్తగూడెం మండలం రుద్రంపూర్‌కు చెందిన వెంకటేశ్వరరావు(48) ఖమ్మం నుంచి రుద్రపూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పెద్దతండా గ్రామం వద్ద కుక్క అడ్డొచ్చింది. దానిని తప్పించే ప్ర యత్నంలో ద్విచక్ర వాహనం అదుపు త ప్పి పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఎస్‌ఐ ఎన్.గౌతమ్ చేర్పించా రు. ఆస్పత్రిలో వెంటేశ్వరరావు మృతిచెం దాడు. అతని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.
రెండు మోటార్ సైకిళ్లు ఢీకొని ఒకరు...
వందనం (చింతకాని): రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి.
ఏఎస్సై ప్రభాకర్‌రావు తెలిపిన ప్రకారం...
బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన ఏదుళ్ల నాగరాజు(25), దస రా పండుగకని తన అత్తగారి గ్రామమైన వందనం గ్రామానికి వచ్చాడు. అతడు, తన బావమరిది శివరామకృష్ణతో కలిసి శుక్రవారం సాయంత్రం మోటార్ సైకిల్‌పై ఊరి చివరిలోగల శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుం డగా, కొదుమూరు గ్రామానికి చెందిన దంతలపల్లి నాగేశ్వరరావు నడుపుతున్న మోటార్ సైకిల్ ఢీ కొంది. నాగరాజు, శివరామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్ తరలిస్తుండగా నాగరాజు మృతిచెం దాడు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శివరామకృష్ణ చికిత్స పొందుతున్నాడు. నాగరాజు కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నాగరాజుకు ఐదునెలల క్రితమే వివాహమైంది.