కల్వకుర్తి, న్యూస్‌లైన్: పాలకులు పాలమూరు జిల్లాపై వివక్ష చూపడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, రోజురోజుకు వలసలు తీవ్రమవుతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. కల్వకుర్తిలోని ప్రొఫెసర్ జయశంకర్ హాల్‌లో గతం-వర్తమానం-భవిష్యత్తు అనే అంశాలపై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వెనుకబడిన పాలమూరు నాయకులు కమీషన్లు తీసుకోవడం ముందున్నారని విమర్శించారు.పాలకులు పాలమూరు జిల్లాపై వివక్ష చూపడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, రోజురోజుకు వలసలు తీవ్రమవుతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. తాత్కాలిక పథకాలకు స్వస్తి చెప్పి, శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయడంతో భూగర్భ జలాలు పెరిగి రైతన్నలు పంటలను సాగుచేసుకునే వీలు ఉంటుం దన్నారు.
రియల్‌దందా పెరిగిపోవడంతో పేదరికంలో కూరుకుపోతున్న ైరె తులు పంట పొలాలను అమ్ముకుంటున్నారని, దీంతో వ్యవసాయం సంక్షోభంలో పడే దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటల నిర్మాణాల కోసం నిధులు మంజూరైనా ఖర్చు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. వ్యవసాయంతో పాటు పాలమూర్‌లో విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మండల కేంద్రంలో డిగ్రీ, నియోజకవర్గ కేంద్రంలో పీజీ కళాశాలలను ఏర్పాటు చేయాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పరిశోధన చేసేందుకు జిల్లాలో బోధన ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారం కోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ పార్టీలు, విద్యావంతులు, కవులు, కళాకారులతో చర్చా వేదికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి సేకరించిన అంశాలపై పుస్తకాలు ప్రచురించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చే యనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ్‌గౌడ్, జంగయ్య, సదానంద్‌గౌడ్, లెక్చరర్ గోపాల్, బాలాజీసింగ్, విజయ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.