Real danda
-
అరాచకం 2.0
సాక్షి, పొందూరు (శ్రీకాకుళం): గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూన రవికుమార్, అతని అనుచరుల దందా మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా సాగింది. చేతిలో అధికారం ఉండడంతో అందిన కాడికి అందినంత దోచుకున్నారు. నచ్చిన వారి అభివృద్ధికి పెద్దపీట వేసి, నచ్చని వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. చేసే ప్రతి పనిలోనూ కమీషన్లు దండుకొని కోట్లకు పడగలెత్తారు. వంశధార గర్భశోకం మండలంలోని సింగూరు, బొడ్డేపల్లి, బెలమాం సమీపంలోని మూడు ఇసుక ర్యాంపులు ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు కోట్ల రూపాయల కాసులు కురిపించాయి. జన్మభూమి కమిటీల సమక్షంలో నాగావళి నది తీరాన రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను జేసీబీలతో తవ్వి, రవికుమార్ అనుచరులు జగన్నాథం, సత్యం, గణపతి తదితరుల సహాయంతో ఇసుక దందా నడిపించారు. ఈ విషయమై పలుమార్లు అధికారులు హెచ్చరించినా వారిని కూడా భయపెట్టిన సంఘటనలు ఉన్నాయి. నిబంధనలు మేరకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను ట్రాక్టర్‌కు రూ.3,500ల వరకు విక్రయించారు. రియల్ దందా ఎమ్మెల్యే కూన రవికుమార్ అండదండలతో పొందూరులో రియల్ ఎస్టేట్ దందా యథేచ్ఛగా సాగింది. ఉడా అనుమతులు లేకుండా భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేశారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.కోట్లు కూడబెట్టారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ చేయాలేని పరిస్థితి కల్పించారు. జాగా కనిపిస్తే పాగా ఐదేళ్ల పాలనలో ఎక్కడ ఖాళీ భూమి కనిపించినా రవికుమార్, అతని అనుచరులు కబ్జా చేసేశారు. రాపాక కూడలికి సమీపంలో విలువైన స్థలాలను ఆక్రమించారు. పాన్పుల గెడ్డను కప్పేసి గృహాలు, దుకాణాలను నిర్మించేశారు. మిగిలిన కొద్దిపాటి గెడ్డను కూడా మరలా కప్పేసేందుకు ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాగే విద్యుత్ పవర్ స్టేషన్ ఎదురుగా ఉన్న సుమారు రూ.10 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అమ్మేందుకు సన్నాహాలు చేశారు. అయితే విషయం బయటకు తెలియడంతో అమ్మకాలు జరగకుండా అధికారులు నిలుపుదల చేశారు. కానీ ఈ స్థలం ఇంకా టీడీపీ నాయకుల ఆధీనంలోనే ఉంది. నీరు–చెట్టు కనికట్టు మండలంలోని 29 పంచాయతీల్లో నీరు–చెట్టు పనుల పేరుతో టీడీపీ నాయకులు తూతూమంత్రంగా పనులు జరిపి రూ.కోట్ల దోచుకున్నారు. చెరువులను అభివృద్ధి చేసే నెపంతో ప్రజల సొమ్మును అడ్డగోలుగా వెనకేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టకుండా, తీర్మానాలు చేయకుండానే పనులు జరిపారు. నిజానికి పనులను కూలీలతో చేయించాల్సి ఉన్నా మిషన్లుతో జరిపి కూలీలకు ఉపాధి లేకుండా చేశారు. నీరు–చెట్టు వలన రవికుమార్ అనుచరులకు తప్ప రైతులకు ఎటువంటి మేలు జరగలేదని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. కమీషన్లకే కొత్త పనులు మండలంలోని రెల్లుగెడ్డ ప్రాజెక్టును ఆధునికీరించేందుకు ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీనిలో భాగంగా గెడ్డకు ఇరువైపులా గట్లను పటిష్టం చేయడం, సిమ్మెంట్ గోడలు నిర్మించడం, చెక్ డ్యాంలు నిర్మించడం వంటి పనులను చేయాలి. అయితే నిధులను దోచేయాలనే తాపత్రయంతో పనులను సగం కూడా జరిపించిన పాపాన పోలేదు. తాడివలస వద్ద చెక్‌డ్యాం, గేట్లు, సిమ్మెంట్ వాల్‌ను రూ.కోటి లతో నిర్మించగా నిర్మించిన నెల రోజులకే అది కూలిపోయింది. కూలిపోయి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పునరుద్ధరించలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడి ‘పింఛెన్’ గ్రామాల్లోని జన్మభూమి కమిటీల సభ్యులు పింఛన్లు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారి పింఛన్లను తొలగించారు. దీంతో అనేక మంది లబ్ధి దారులకు పింఛన్లు అందక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, ఎంపీపీ ప్రతినిధి సువ్వారి గాంధీ బాధిత పింఛన్‌దారుల తరుపున జన్మభూమి కమిటీలకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లి పోరాడి 470 మంది పింఛన్లను బకాయిలతో సహ ఇప్పించేందుకు కృషి చేశారు. అయినప్పటికీ ఇంకా చాలా మంది అర్హులకు పింఛన్లు అందడం లేదు. అధికారులు హెచ్చరించినా ఆగలేదు సింగూరు, బొడ్డేపల్లి, బెలమాం సమీపంలోని ఇసుక ర్యాంపులను అధికారులు పలుమార్లు మూయించారు. కానీ మూసిన రెండు రోజుల్లోనే విప్ రవికుమార్ మరలా తెరిపించేవారు. నదీ గర్భాలను కొల్లగొట్టి అధిక ధరలకు ఇసుకను విక్రయించారు. ఇప్పటికీ ఇసుక దందా కొనసాగుతూనే ఉంది. – బొడ్డేపల్లి రమణ, బొడ్డేపల్లి గెడ్డలను ఆక్రమించేశారు రాపాక సెంటర్లో పాన్పుల గెడ్డను టీడీపీ నాయకులు ఆక్రమించి బిల్డింగులు కట్టేశారు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, కుమ్మరి, ముస్లింలు ఎంతో మంది భూమిలేని పేదలున్నారు. వారికి భూమి ఇచ్చేందుకు అధికారులకు నిబంధనలు గుర్తుకొస్తున్నాయి. టీడీపీ నాయకులు గెడ్డలను ఆక్రమించుకుంటుంటే మాత్రం నిబంధనలు కనిపించకపోవడం దారుణం. – కొంచాడ రమణమూర్తి, రాపాక -
నక్సల్స్, ఫ్యాక్షనిస్టులకు అడ్డా
– క్రైం కార్నర్‌గా షాద్‌నగర్ ప్రాంతం – ‘రియల్’ దందాతోనే ఇటువైపు అడుగులు క్రైం కార్నర్‌గా షాద్‌నగర్ మారిందా..? నక్సల్స్, ఫ్యాక్షనిస్టులు ఈ పరిసర ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారా..? రియల్ దందానే వారిని ఇటువైపు అడుగులు వేయిస్తోందా..? ఈ విషయాలు గమనిస్తే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి.. నయీం ఎన్‌కౌంటర్‌తోపాటు గతంలో జరిగిన ఘోర సంఘటనలు పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతోంది. షాద్‌నగర్ : రాష్ట్ర రాజధానికి నియోజకవర్గం కూతవేటు దూరంలో ఉండటం.. మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగి ఉండటం.. మినీ ఇండియా లాంటి షాద్‌నగర్ ప్రాంతాన్ని క్రైం జోన్‌గా ఎంచుకునేలా చేస్తుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ౖహె దరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలతో పోలిస్తే షాద్‌నగర్ పట్టణమే నేరాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. – ప్రధానమంత్రి మోదీ పర్యటన మరుసటి నాడే గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్లో మతి చెందాడు. దీంతో షాద్‌నగర్ పట్టణం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సంచలనమైంది. అంతర్రాష్ట్ర నేరస్తుడు ఈ ప్రాంతంలోనే ఎంతోకాలంగా నివాసం ఏర్పరుచుకుని తన కార్యకలాపాలను కొనసాగించడం చూస్తుంటే షాద్‌నగర్ పట్టణం క్రైం జోన్‌కు అంత అనుకూలంగా ఉందా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రాత్రింబవళ్లు సైరన్మోతలతో నిత్యం పోలీసులు పట్టణాన్ని జల్లెడపడుతున్నా నేరాగాళ్ల అచూకీ కనిపెట్టడంలో విఫలమయ్యారనడానికి నయీం సంఘటనే నిదర్శనం. ఎంతోకాలంగా షాద్‌నగర్ ప్రాంతంలో నివాసముంటూ నేర సామ్రాజ్యాన్ని కొనసాగించిన నయీం కార్యకలాపాలపై నిఘా పెట్టలేకపోయారనే విమర్శలున్నాయి. నయీం ఎన్‌కౌంటర్‌కు ముందు షాద్‌నగర్ పరిసరాల్లో సంచలనాలు సష్టించిన సంఘటనలు కోకొల్లలు. – మిలినీయం టౌన్షిప్లో నయీం నివాసమున్న ఇంటి ప్రాంతంలోనే గతంలో మావోయిస్టులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు ఉదంతులు వినిపించాయి. 1995–96కాలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయిలోని జీపును పట్టణ ముఖ్యకూడలిలో కొందరు వ్యక్తులు నిప్పంటించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. – 2002–03 ప్రాంతంలో దోపిడీదొంగల ముఠా అలీవ్గ్రీన్కు షాద్‌నగర్‌లోని ఓ స్వర్ణకారుడితో సంబంధం ఉందా అని పోలీసులు ముఠా సభ్యులను విచారణ నిమిత్తం పట్టణానికి తీసుకొచ్చారు. అనంతరం ముఠా సభ్యులు నియోజకవర్గ శివారులో ఎన్కౌంటర్లో మతిచెందారు. – గతంలో ఎస్ఐ శివకుమార్ వాహనాలను తనిఖీ చేస్తుండగా షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రి సమీపంలో ఒక ఐఎస్ఐ ఏజెంటును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. –2007లో ఫరూఖ్‌నగర్ మండలంలోని బూర్గులకు చెందిన ఓ నక్సలైట్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. – 20ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండులో ఇద్దరి వ్యక్తుల్ని వేటకొడవళ్లతో కొందరు కిరాతకంగా దాడిచేసి హతమర్చారు. – నాలుగేళ్ల క్రితం పట్టణ శివారులోని అనూస్ పరిశ్రమ సమీపంలో రాయలసీమకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని కొందరు వేటకొడవళ్లతో వెంటాడి చంపారు. – 2014లో ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద, చిల్కమర్రిలో నిల్వ ఉంచిన కోట్ల రూపాయల విలువ జేసే ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహాలో షాద్‌నగర్‌లో చోటు చేసుకున్న సంఘటనలన్నీ రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేసినవే. దీనికితోడు అంతర్జాతీయ విమానాశ్రయ పుణ్యమా అని ఇక్కడ భూములు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో రాజధానిలో తమసత్తా చాటుకున్న గ్యాంగ్స్టర్ల కన్ను ఇక్కడి వాటిపైనా పడింది. రాజధాని సమీపంలో తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అభివద్ధి చెందడంతో గ్యాంగ్స్టర్లు తమ ఉనికిని చాటుకున్నారు. -
మిర్యాలగూడలో రియల్ దందా..
► జోరుగా అనధికార లే అవుట్లు ► కొరవడిన అధికారుల పర్యవేక్షణ ► మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి జోరుగా అనధికార లే అవుట్లు మిర్యాలగూడను నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం.. ఇప్పటికే వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో ఈ పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ జోరందుకుంది. వ్యాపారులు పట్టణ పరిసరాల్లోని పంట పొలాలను అనుమతులు లేకుండానే అనధికార లే అవుట్లుగా మార్చారు. వాటిని ప్లాట్లుగా విభజించి విక్రయిస్తూ రూ. కోట్లు గడిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. - మిర్యాలగూడ :- మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలను మళ్లీ రియల్ భూతం వెంటాడుతోంది. పట్టణ చుట్టు పక్కన ఉన్న పంట పొలాలు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల గుప్పిట్లో ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే వాటిని ప్లాట్లుగా విభజించి ఆకర్షవంతమైన ప్రకటనలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. రూ.లక్షలకు కొనుగోలు చేసిన పొలాలను ప్లాట్లుగా చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతాలలోని అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి వెంట, తాళ్లగడ్డ, బాపూజీనగర్, ఏడుకోట్లతండా సమీపంలో అనుమతి లేని వెంచ ర్లు వెలుస్తున్నా యి. వెంచర్లలో మున్సిపల్ అధికారు లు గుర్తిం చకుం డా రా ళ్లను భూమిలోపలికి పాతి ప్లాట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్లో పది శాతం భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయా ల్సి ఉంది. అలా చేయకుండానే మొత్తం స్థలాన్ని ప్లాట్లుగా విభజించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 150 గజాల స్థలం రూ.నాలుగు నుంచి ఐదు లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. అనధికారిక లేఅవుట్ల కారణంగా మున్సిపాలిటీకి చెందాల్సిన స్థలం రాకపోవడంతో పాటు పన్ను రూపంలో రావల్సిన ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తోంది. అధికారుల అండదండలు..? పట్టణంలో జోరుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. అనధికారిక లే అవుట్ల యాజమాన్యాలపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. పురపాలక సంఘం చట్టం 1965 సెక్షన్ 184, 185 ప్రకారం అనధికారిక లే అవుట్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవల్సి ఉంది. కానీ అధికారులు గతంలో అనుమతి లేని లే అవుట్ల వద్ద కొలత రాళ్లను తీసివేసి చేతులు దులుపుకున్నారు. కానీ తిరిగి యథావిథిగా లే అవుట్ల వ్యాపారం జరుగుతూనే ఉంది. 13 అనధికారిక వెంచర్లు మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాల్లో 13 అనధికారిక వెంచర్లు వెలిసినట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈ వెంచర్లలో సుమారుగా 30 ఎకరాల వరకు పంట పొలాలను ప్లాట్లుగా విభజించినట్లు తెలిసింది. అనధికారిక వెంచర్ల వల్ల మున్సిపాలిటీకి చెందాల్సిన 10 శాతం భూమితో పాటు ఎకరానికి రూ.30 వేల ఆదాయం పన్ను రూపంలో రావల్సింది కోల్పోతున్నారు. 30 ఎకరాలకు గాను మున్సిపల్ అధికారులు సుమారుగా 10 లక్షల ఆదాయం కోల్పోయారు. అనధికారికంగా వెలిసిన వెంచర్లలో 2015కు ముందుగా కొనుగోలు చేసిన వారు మున్సిపల్ స్థలాల క్రమబద్ధీకరణలో భాగంగా మున్సిపాలిటీకి దరఖాస్తులు పెట్టుకున్నారు. దాని ద్వారా సుమారుగా మూడు కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కానీ 2015 తర్వాత వెలిసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్సిపాలిటీ వారు ఇంటి నిర్మాణానికి అనుమతులు కూడా ఇవ్వడం లేదు. లే అవుట్లకు ఉండాల్సిన నిబంధనలు: ► మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఉండాలి. ► రోడ్లకు, పాఠశాల బిల్డింగ్‌కు, పార్కు, ఇతర సౌకర్యాల కోసం 10 శాతం భూమిని మున్సిపాలిటీ పేర రిజిస్ట్రేషన్ చేయాలి. ► మంచినీటి వసతికి ట్యాంకు నిర్మించాలి. ► రోడ్లు, వీధి దీపాలు, మురుగు కాలువలు నిర్మించాలి. ► ఇవన్నీ ఏర్పాటు చేశాక లేఅవుట్ల కోసం మున్సిపల్ కార్యాలయంలో తగిన ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ► డెరైక్టర్ ఆఫ్ టౌన్ కంట్రోల్ ప్లానింగ్ అనుమతితో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. నోటీసులు జారీ చేస్తాం పట్టణంలో అనుమతి లేకుండా వెంచర్లు ఏర్పాటు చేస్తే నోటీసులు జారీ చేస్తాము. 2015 తర్వాత అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు నిలిపివేశాము. 2015కు ముందుగా అనుమతి లేని వెంచర్లలో కొనుగోలు చేసిన వారికి మాత్రం ప్రభుత్వ నిబంధనల మేరకు రెగ్యులరైజేషన్ కింద దరకాస్తులు తీసుకున్నాము. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దు. అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లలో కొనుగోలు చేయాలి. - కందుల అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్, మిర్యాలగూడ -
రాజధాని పేరుతో రియల్‌దందా
గుంటూరు సిటీ: రాజధానిపై పచ్చచొక్కాల రియల్టర్లు చక్కర్లు కొడుతున్నారని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ నేత కత్తెర సురేష్ ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ముసుగులో ప్రభుత్వమే నేరుగా రియల్ దందా చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే అక్కడి రైతులను మోసం చేసి పచ్చని పొలాలు కాజేసిన ప్రభుత్వం తాజాగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని ఇళ్లను సైతం ఖాళీ చేయించే దిశగా కసరత్తు మొదలెట్టిందని ఆరోపించారు. నమ్మి ఓట్లేసినందుకు నట్టేట ముంచుతుందన్నారు. తరతరాలుగా పూర్వీకుల నాటి నుంచి అక్కడే ఉంటున్న ప్రజలను తరలించాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు మాట్లాడుతూ, శాఖమూరు, ఐనవోలు, నేలపాడు, వెలగపూడి గ్రామాలను పూర్తిగా మింగేసే రీతిలో ప్రభుత్వం చకచకా పావులు కదుపుతుందని ఆరోపించారు. గ్రామాలు ఖాళీ చేయించడం దుర్మార్గపూరితమైన కుట్రగా ఆయన అభివర్ణిచారు. అధిక సంఖ్యలో దళితులు అక్కడ రైతు కూలీలుగా ఏళ్ళ తరబడి పనిచేస్తున్నారన్నారు. వారికి కూడా కుటుంబానికి పాతిక లక్షలు, రాజధాని పరిధిలోనే పక్కా ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలనీ, ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందేలా తగు చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. తాము చేసే పోరాటాలకు సంపూర్ణ మద్ధతు ప్రకటించాలని బండారు సాయిబాబు అన్ని ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి శిఖా బెనర్జీ, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జంగా జయరాజు, సుద్దపల్లి నాగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.దేవరాజ్, యనమల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
‘రియల్’ ఢమాల్
హసన్‌పర్తి/పరకాల : జిల్లాలో రియల్ దందా కుదేలైంది. విక్రయదారులు ప్లాట్లు చేసి కొనుగోలుదారుల కోసం ‘కోటి’ కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆరేళ్లపాటు రూ.కోట్లలో సాగిన వ్యాపారం ఏడాది కాలంగా కొనేవారు లేక డీలా పడింది. ఎంత వేగంగా దూసుకెళ్లిందో.. అంతే వేగంతో పడిపోరుుంది. రియల్ కార్యాలయూలు బోసిపోతున్నారుు. వ్యాపారులు ఇతర దందాలపై దృష్టిసారిస్తున్నారు. రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయూలు వెలవెల బోతున్నారుు. ఆదాయం తగ్గడమే ఇందుకు ఉదాహరణ. లాభసాటి వ్యాపారం కావడంతో కొందరు బడా వ్యాపారులు అప్పుగా తీసుకొచ్చి భూములు కొని ప్లాట్లు చేశారు. దందా నడువక.. చేసిన అప్పుకు మిత్తి పెరగడం.. అప్పు తీర్చే మార్గం లేక ఐపీ పెడుతున్నారు. కారణాలు అనేకం.. వరంగల్ గ్రేటర్‌గా మారడం రియల్ దందాపై ప్రభావం పడింది. విలీన గ్రామాల భూములు గ్రేటర్ పరిధిలోకి వచ్చారుు. విలీనానికి ముందు వ్యాపారులు గ్రామాల్లో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేశారు. పంచాయతీ పరిధిలో ఉంటే అనుమతి చార్జీలు తక్కువగా ఉండేవి. గ్రేటర్ పరిధిలో అనుమతి పొందాలంటే రూ.లక్షల్లో బెటర్మెంట్ చార్జీలు, ఇతర చార్జీల రూపకంలో బల్దియూకు చెల్లించాలి. అంతే మొత్తంలో ప్లాట్లకు ధరలు పెరిగారుు. ఇంత మొత్తం వ్యయంతో ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ప్లాటు కొనుగోలు చేసినా... ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ నుంచి అనుమతి సులువుగా లభించేది. ఇప్పుడు ‘కుడా’ నుంచి అనుమతికి రూ.లక్షలు వెచ్చించాలి. వరంగల్ గ్రేటర్‌గా మారడంతో పరిసర ప్రాంతాల భూముల ధరలు ఆకాశాన్నంటాయి. నగర శివారులో గజం స్థలం ధర కనీసం రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. ఫలితంగా భూముల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూముల ధరలు చుక్కలనంటడంతో పట్టాదారుల వారసులు రంగ ప్రవేశం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా పహాణీలు పొంది భూమి మాదే అని బుకారుుస్తున్నారు. అమ్మినపుడు సంతకాలు లేవు అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. లేకపోతే కోర్టును ఆశ్రరుుస్తున్నారు. ఈ తలనొప్పులతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. కొందరు రియల్ వ్యాపారులు వెంచర్లలోని రహదారులను ప్లాట్లుగా చేసి విక్రయం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. కొందరు రియల్టర్లు క్షేత్రస్థాయిలో ప్లాట్లు చేయకుండా పేపర్ పైనే మ్యాప్ వేసి విక్రయిస్తున్నారు. ఇంకా కొందరు రియల్టర్లు చెరువు శిఖంలో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వైపు కొనుగోలుదారులు దృష్టి సారించారు. కొత్త రాష్ర్టం కాబట్టి రాజధానిలోని సీమాంధ్రులు వెళ్లిపోతే భూముల ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. సీమాంధ్రులు విక్రయించే భవనాలు, ప్లాట్లు పక్కాగా రిజిస్ట్రేషన్ అయి ఉంటాయని.. వాటిని కొనుగోలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. నగర శివారులో ధరలు భారీగా ఉండడంతో రాజధానివైపు మొగ్గు చూపుతున్నారు. గత ఎన్నికల ప్రభావం కూడా రియల్ భూమ్‌పై పడింది. పోటీ చేసిన వారు గెలుపు కోసం లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత భూముల కొనుగోలుకు పెట్టుబడి లేకపోవడంతో ముందుకు రావడం లేదు.ప్లాట్లను ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేయడంతో ధరలు అధికంగా ఉంటున్నారుు. తెలంగాణ రియల్టర్లు ఆంధ్రాలో రియల్ వ్యాపారం లాభాసాటిగా ఉండడంతో అటు వైపు దృష్టిసారించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడి దారులు అందరూ ఆంధ్రా వాళ్లే ఉండేవారు. ఇప్పుడు వారు రాష్ట్రం ఏర్పడంతో వెళ్లిపోయూరు. షేర్ మార్కెట్ కూడా ఊపుమీద ఉండటంతో అందరూ షేర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణాలతో జిల్లాలో రియల్ వ్యాపారం ఢమాల్ అరుుందని చెప్పొచ్చు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవడక పోవడంతో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. రైతుల చేతిలో డబ్బులు లేక పోవడం,వ్యవసాయాధారిత వ్యాపారాలు ఆశించినమేర లేకపోవడంతో భూముల కొనుగోళ్ల వైపు చూడడం లేదు. పట్టాదారుల వారసులు కోర్టుకు ఎక్కడం.. రియల్ ఎస్టేట్ కోసం భూములు సేకరించిన తర్వాత పట్టాదారుడి వారసులు వచ్చి.. మేం సంతకం చేయలేదు.. ఇందులో మాకు హక్కు ఉంటుందని కోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇబ్బందులకు గురవుతున్నాం. ఎంతో కొంత ఇచ్చి వారితో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ప్లాట్లల్లో గొడవ ఉండడం వల్ల కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. - అటికం రవి, రియల్టర్, భీమారం -
‘రియల్’ దందా..!
ఏపీ రాజధానిపై ప్రభుత్వ పెద్దల ప్రకటనల ఫలితం సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం పేరిట కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున రియల్ దందా సాగుతోంది. కొందరు పనిగట్టుకుని సాగిస్తున్న ఈ వ్యవహారంలో రైతులు, సాధారణ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. మాగాణి భూములన్నీ రియల్టర్లు, బ్రోకర్ల చేతిలో ఇరుక్కుపోతున్నాయి. వీరివెనుక బడా నేతలు ఉన్నారు. నేరుగా రంగంలోకి దిగితే ఇబ్బం దులు పడుతామని భావిస్తున్న ఈ నేతలు రియల్టర్ల ద్వారా తతంగం కానిస్తున్నారు. బడా నేతలు, వారి అనుచురులు రియల్టర్ల ద్వారా నామమాత్రపు అడ్వాన్సులు చెల్లించి రైతుల భూములను తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలు రాష్ట్ర, కేంద్ర మంత్రుల నుంచి తరచూ రాజధానిపై రకరకాల ప్రకటనలు వెలువడుతున్నాయి. అవన్నీ కృష్ణా, గుంటూరు జిల్లాలను కేం ద్రంగా చేసుకుని వెలువడుతున్నవే కావడం గమనార్హం. రాజ ధాని అక్కడే అంటూ పత్రికల్లో వెలువడుతున్న కథనాలు వారి ప్రకటనలకు తోడవుతున్నాయి. ఇంకేముంది అక్కడే అసెంబ్లీ, ఇక్కడే సచివాలయం అంటూ తెల్లారేసరికే రంగు రంగుల కరపత్రాలు రోడ్లపైకి వస్తున్నాయి. ‘రాష్ట్ర రాజధాని విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఉండొచ్చు. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనుకూలం...’ నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలు చేసిన ప్రకటనల సారాంశం ఇది. దీంతో ఈ రెండు నగరాల మధ్య భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. విజయవాడ, గుంటూరు నగర శివారుల్లోని స్థలాల క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. ‘అమరావతి’ ప్రచారంతో రియల్టర్లలో ఆందోళన... గుంటూరు జిల్లా అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయంటూ ఒక దినపత్రిక ప్రచురించిన ప్రత్యేక కథనంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. దీంతో ఏలూరు - గన్నవరం - విజయవాడ - మంగళగిరి ప్రాంతాల ప్రజల్లో కలకలం సృష్టిం చింది. ఇక్కడ భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. అంతకు పూర్వం ఈ ప్రాంతాల్లో అత్యధిక ధరలకు పొలాలు కొనుగోలు చేసిన రియల్టర్లు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు కాకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు. మూడు రోజులుగా భూములు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ ప్రాంతంలోనూ భూముల ధరలకు రెక్కలు... మరోవైపు.. అమరావతి, తాడికొండ, అచ్చంపేట, కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల, గొల్లపూడి ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. నదికి అటువైపున కృష్ణా జిల్లాలోని ప్రాంతాలను కలుపుతూ భారీ వంతెనలను నిర్మించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఆ ప్రత్యేక కథనంలో పేర్కొనడటంతో రెండు వైపులా వ్యవసాయ భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. -
నిబంధనలకు పంచర్
ఇల్లందలో అక్రమ వెంచర్ పట్టించుకోని అధికారులు సాక్షి, హన్మకొండ : అధికార పార్టీ నాయకులు లాభాపేక్షే లక్ష్యంగా రియల్ దందా సాగిస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అధికార యం త్రాంగం.. వారికే అండగా నిలవడంతో వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారిపోతున్నాయి. వర్ధన్నపేట మండలంలో వందల ఎకరాల సాగు భూములు రియల్టర్ల చేతుల్లోకి వెళ్లాయి. తాజాగా ఇల్లంద సమీపంలో అక్రమంగా మరో వెంచర్ వెలిసింది. వర్ధన్నపేట మండలం.. వరంగల్ నగరానికి అతి సమీపంగా ఉండడంతో పాటు వరంగల్-ఖమ్మం హైవే ఈ మండలం మధ్యగుండా పోతున్నది. దీంతో ఇక్కడి వ్యవసాయ భూములకు రియల్ కళ వచ్చేసింది. ముఖ్యంగా వర్దన్నపేట మండల కేంద్రం డీసీతండా, ఇల్లంద, కట్య్రాల, పంథిని గ్రామాలపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఇక్కడి రైతుల నుంచి ఎకరా భూమిని రూ.70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఇల్లందలో మరోసారి.. తాజాగా ఇల్లంద గ్రామ సమీపంలో వెలసిన వెంచర్ ఇక్కడి రియల్‌దందా తీరుకు అద్దం పడుతోంది. హైవే పక్కన ఎస్సీ హాస్టల్ వెనక భాగంలో ఐదెకరాల స్థలాన్ని గ్రామంచాయతీ, రెవెన్యూశాఖల అనుమతి లేకుండానే కొందరు వ్యక్తులు వెంచర్ చేశారు. అధికార పార్టీకి చెందిన నేత ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడుస్తోంది. నిబంధనలను బేఖాతర్ చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. పంచాయతీ నుంచి అనుమతి తీసుకోకుండా, భూబదాలయింపు జరగకుండానే ఐదెకరాల్లో మొత్తం 100 ప్లాట్లతో ఈ వెంచర్ ప్రారంభించారు. ఇందులో గజం స్థలానికి రూ. 3వేల నుంచి రూ.8వేలు ధర నిర్ణయించినట్లు సమాచారం. పంచాయతీ ఆదాయానికి గండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూమిలో ప్లాట్లు చేస్తూ పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని ప్లాట్లుగా చేయాలంటే తొలుత పంచాయతీ అనుమతి తీసుకోవాలి. ఎన్ని అడుగుల స్థలాన్ని రోడ్ల నిర్మాణం కోసం కేటాయిస్తున్నారు.. పబ్లిక్ ట్యాప్‌లు, విద్యుత్ లైన్ల ఏర్పాటు సమాచారంతో ప్లాన్ రూపొందిం చి గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా ల్యాండ్ కన్వర్షన్ చేయించాలి. అంతే కాకుండా భవిష్యత్తు సామాజిక అవసరాల దృష్ట్యా వెంచర్లో పది శాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలి. కానీ ఈ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ఆందోళన చేసినా ఆగలేదు ఇల్లంద ఎస్సీ కాలనీ నుంచి ప్రవహించే వరద నీటి కాల్వకు అడ్డుగా ఈ రియల్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తుండడంతో దళితులు మూడు నెలల క్రితం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి వెంచర్ ఏర్పాటును అడ్డుకున్నారు. ఈ వెంచర్లో ఇళ్లు వెలిస్తే తమ ఇళ్లు మురికికూపాలుగా మారిపోతాయని ఇక్కడి దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వచ్చిన పంచాయతీ, రెవెన్యూశాఖ అధికారులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతపరిచారు. అధికారులు జోక్యం చేసుకుని వరద కాల్వ నిర్మించిన తర్వాత వెంచర్ చేసుకోవాలని చెప్పారు. కానీ, అనుమతి లేకుండానే భూమిని చదును చేసి, రాళ్లు పాతి ప్లాట్లుగా మార్చినా అధికారులు మిన్నకుండిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేకుండా కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అరికట్టాల్సి న పంచాయతీ, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి. గతంలో రెవెన్యూ సిబ్బంది వ్యవహారశైలిపై విమర్శలు రావడంతో రెండేళ్ల క్రింతం ఇల్లంద, పంథిని గ్రామాల్లో సర్వే చేసి అనుమతి లేని వెంచర్లలోని హద్దురాళ్లను తొలగించి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై రెవెన్యూ అధికారులు నిఘా పెట్టడం లేదు. సరై న అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు పంచాయతీ అనుమతుల కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
పాలకుల వివక్షతోనే పాలమూరు వెనకబాటు
కల్వకుర్తి, న్యూస్‌లైన్: పాలకులు పాలమూరు జిల్లాపై వివక్ష చూపడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, రోజురోజుకు వలసలు తీవ్రమవుతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. కల్వకుర్తిలోని ప్రొఫెసర్ జయశంకర్ హాల్లో గతం-వర్తమానం-భవిష్యత్తు అనే అంశాలపై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వెనుకబడిన పాలమూరు నాయకులు కమీషన్లు తీసుకోవడం ముందున్నారని విమర్శించారు.పాలకులు పాలమూరు జిల్లాపై వివక్ష చూపడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, రోజురోజుకు వలసలు తీవ్రమవుతున్నాయని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. తాత్కాలిక పథకాలకు స్వస్తి చెప్పి, శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న చెరువులు, కుంటలకు మరమ్మతులు చేయడంతో భూగర్భ జలాలు పెరిగి రైతన్నలు పంటలను సాగుచేసుకునే వీలు ఉంటుం దన్నారు. రియల్‌దందా పెరిగిపోవడంతో పేదరికంలో కూరుకుపోతున్న ైరె తులు పంట పొలాలను అమ్ముకుంటున్నారని, దీంతో వ్యవసాయం సంక్షోభంలో పడే దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటల నిర్మాణాల కోసం నిధులు మంజూరైనా ఖర్చు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. వ్యవసాయంతో పాటు పాలమూర్లో విద్యాభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మండల కేంద్రంలో డిగ్రీ, నియోజకవర్గ కేంద్రంలో పీజీ కళాశాలలను ఏర్పాటు చేయాలని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం పరిశోధన చేసేందుకు జిల్లాలో బోధన ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో నెలకొన్న అనేక సమస్యల పరిష్కారం కోసం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ పార్టీలు, విద్యావంతులు, కవులు, కళాకారులతో చర్చా వేదికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి సేకరించిన అంశాలపై పుస్తకాలు ప్రచురించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా కృషి చే యనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు నారాయణ్‌గౌడ్, జంగయ్య, సదానంద్‌గౌడ్, లెక్చరర్ గోపాల్, బాలాజీసింగ్, విజయ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.