హసన్‌పర్తి/పరకాల : జిల్లాలో రియల్ దందా కుదేలైంది. విక్రయదారులు ప్లాట్లు చేసి కొనుగోలుదారుల కోసం ‘కోటి’ కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆరేళ్లపాటు రూ.కోట్లలో సాగిన వ్యాపారం ఏడాది కాలంగా కొనేవారు లేక డీలా పడింది. ఎంత వేగంగా దూసుకెళ్లిందో.. అంతే వేగంతో పడిపోరుుంది. రియల్ కార్యాలయూలు బోసిపోతున్నారుు. వ్యాపారులు ఇతర దందాలపై దృష్టిసారిస్తున్నారు. రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయూలు వెలవెల బోతున్నారుు. ఆదాయం తగ్గడమే ఇందుకు ఉదాహరణ. లాభసాటి వ్యాపారం కావడంతో కొందరు బడా వ్యాపారులు అప్పుగా తీసుకొచ్చి భూములు కొని ప్లాట్లు చేశారు. దందా నడువక.. చేసిన అప్పుకు మిత్తి పెరగడం.. అప్పు తీర్చే మార్గం లేక ఐపీ పెడుతున్నారు.
కారణాలు అనేకం..
వరంగల్ గ్రేటర్‌గా మారడం రియల్ దందాపై ప్రభావం పడింది. విలీన గ్రామాల భూములు గ్రేటర్ పరిధిలోకి వచ్చారుు. విలీనానికి ముందు వ్యాపారులు గ్రామాల్లో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేశారు. పంచాయతీ పరిధిలో ఉంటే అనుమతి చార్జీలు తక్కువగా ఉండేవి. గ్రేటర్ పరిధిలో అనుమతి పొందాలంటే రూ.లక్షల్లో బెటర్‌మెంట్ చార్జీలు, ఇతర చార్జీల రూపకంలో బల్దియూకు చెల్లించాలి. అంతే మొత్తంలో ప్లాట్లకు ధరలు పెరిగారుు. ఇంత మొత్తం వ్యయంతో ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు.
ఒకవేళ ప్లాటు కొనుగోలు చేసినా... ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ నుంచి అనుమతి సులువుగా లభించేది. ఇప్పుడు ‘కుడా’ నుంచి అనుమతికి రూ.లక్షలు వెచ్చించాలి.
వరంగల్ గ్రేటర్‌గా మారడంతో పరిసర ప్రాంతాల భూముల ధరలు ఆకాశాన్నంటాయి. నగర శివారులో గజం స్థలం ధర కనీసం రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. ఫలితంగా భూముల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. భూముల ధరలు చుక్కలనంటడంతో పట్టాదారుల వారసులు రంగ ప్రవేశం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా పహాణీలు పొంది భూమి మాదే అని బుకారుుస్తున్నారు. అమ్మినపుడు సంతకాలు లేవు అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. లేకపోతే కోర్టును ఆశ్రరుుస్తున్నారు. ఈ తలనొప్పులతో కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు.
కొందరు రియల్ వ్యాపారులు వెంచర్లలోని రహదారులను ప్లాట్లుగా చేసి విక్రయం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. కొందరు రియల్టర్లు క్షేత్రస్థాయిలో ప్లాట్లు చేయకుండా పేపర్ పైనే మ్యాప్ వేసి విక్రయిస్తున్నారు. ఇంకా కొందరు రియల్టర్లు చెరువు శిఖంలో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వైపు కొనుగోలుదారులు దృష్టి సారించారు. కొత్త రాష్ర్టం కాబట్టి రాజధానిలోని సీమాంధ్రులు వెళ్లిపోతే భూముల ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. సీమాంధ్రులు విక్రయించే భవనాలు, ప్లాట్లు పక్కాగా రిజిస్ట్రేషన్ అయి ఉంటాయని.. వాటిని కొనుగోలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. నగర శివారులో ధరలు భారీగా ఉండడంతో రాజధానివైపు మొగ్గు చూపుతున్నారు.
గత ఎన్నికల ప్రభావం కూడా రియల్ భూమ్‌పై పడింది. పోటీ చేసిన వారు గెలుపు కోసం లక్షలు ఖర్చు చేశారు. ఆ తర్వాత భూముల కొనుగోలుకు పెట్టుబడి లేకపోవడంతో ముందుకు రావడం లేదు.ప్లాట్లను ఒకరి నుంచి మరొకరు కొనుగోలు చేయడంతో ధరలు అధికంగా ఉంటున్నారుు. తెలంగాణ రియల్టర్లు ఆంధ్రాలో రియల్ వ్యాపారం లాభాసాటిగా ఉండడంతో అటు వైపు దృష్టిసారించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పెట్టుబడి దారులు అందరూ ఆంధ్రా వాళ్లే ఉండేవారు. ఇప్పుడు వారు రాష్ట్రం ఏర్పడంతో వెళ్లిపోయూరు. షేర్ మార్కెట్ కూడా ఊపుమీద ఉండటంతో అందరూ షేర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణాలతో జిల్లాలో రియల్ వ్యాపారం ఢమాల్ అరుుందని చెప్పొచ్చు.
ఈ ఏడాది వర్షాలు సరిగా కురవడక పోవడంతో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. రైతుల చేతిలో డబ్బులు లేక పోవడం,వ్యవసాయాధారిత వ్యాపారాలు ఆశించినమేర లేకపోవడంతో భూముల కొనుగోళ్ల వైపు చూడడం లేదు.
పట్టాదారుల వారసులు కోర్టుకు ఎక్కడం..
రియల్ ఎస్టేట్ కోసం భూములు సేకరించిన తర్వాత పట్టాదారుడి వారసులు వచ్చి.. మేం సంతకం చేయలేదు.. ఇందులో మాకు హక్కు ఉంటుందని కోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇబ్బందులకు గురవుతున్నాం. ఎంతో కొంత ఇచ్చి వారితో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ప్లాట్లల్లో గొడవ ఉండడం వల్ల కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు.
- అటికం రవి, రియల్టర్, భీమారం
‘రియల్’ ఢమాల్
Published Sun, Feb 22 2015 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement