షాద్‌నగర్ పట్టణ శివారులో 2012 ఆగస్టు 31న హత్యకు గురైన వ్యక్తి మతదేహాన్ని పరిశీలిస్తున్న అప్పటి ఎస్పీ నాగేంద్రకుమార్ (ఫైల్)
నక్సల్స్, ఫ్యాక్షనిస్టులకు అడ్డా
Published Sat, Aug 13 2016 9:31 PM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM
– క్రైం కార్నర్‌గా షాద్‌నగర్ ప్రాంతం
– ‘రియల్’ దందాతోనే ఇటువైపు అడుగులు
క్రైం కార్నర్‌గా షాద్‌నగర్ మారిందా..? నక్సల్స్, ఫ్యాక్షనిస్టులు ఈ పరిసర ప్రాంతాలను అడ్డాగా మార్చుకుంటున్నారా..? రియల్ దందానే వారిని ఇటువైపు అడుగులు వేయిస్తోందా..? ఈ విషయాలు గమనిస్తే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి.. నయీం ఎన్‌కౌంటర్‌తోపాటు గతంలో జరిగిన ఘోర సంఘటనలు పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతోంది.
షాద్‌నగర్ : రాష్ట్ర రాజధానికి నియోజకవర్గం కూతవేటు దూరంలో ఉండటం.. మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగి ఉండటం.. మినీ ఇండియా లాంటి షాద్‌నగర్ ప్రాంతాన్ని క్రైం జోన్‌గా ఎంచుకునేలా చేస్తుందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ౖహె దరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలతో పోలిస్తే షాద్‌నగర్ పట్టణమే నేరాలకు కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు.
– ప్రధానమంత్రి మోదీ పర్యటన మరుసటి నాడే గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌లో మతి చెందాడు. దీంతో షాద్‌నగర్ పట్టణం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి సంచలనమైంది. అంతర్రాష్ట్ర నేరస్తుడు ఈ ప్రాంతంలోనే ఎంతోకాలంగా నివాసం ఏర్పరుచుకుని తన కార్యకలాపాలను కొనసాగించడం చూస్తుంటే షాద్‌నగర్ పట్టణం క్రైం జోన్‌కు అంత అనుకూలంగా ఉందా ? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రాత్రింబవళ్లు సైరన్‌మోతలతో నిత్యం పోలీసులు పట్టణాన్ని జల్లెడపడుతున్నా నేరాగాళ్ల అచూకీ కనిపెట్టడంలో విఫలమయ్యారనడానికి నయీం సంఘటనే నిదర్శనం. ఎంతోకాలంగా షాద్‌నగర్ ప్రాంతంలో నివాసముంటూ నేర సామ్రాజ్యాన్ని కొనసాగించిన నయీం కార్యకలాపాలపై నిఘా పెట్టలేకపోయారనే విమర్శలున్నాయి. నయీం ఎన్‌కౌంటర్‌కు ముందు షాద్‌నగర్ పరిసరాల్లో సంచలనాలు సష్టించిన సంఘటనలు కోకొల్లలు.
– మిలినీయం టౌన్‌షిప్‌లో నయీం నివాసమున్న ఇంటి ప్రాంతంలోనే గతంలో మావోయిస్టులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు ఉదంతులు వినిపించాయి. 1995–96కాలంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయిలోని జీపును పట్టణ ముఖ్యకూడలిలో కొందరు వ్యక్తులు నిప్పంటించారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
– 2002–03 ప్రాంతంలో దోపిడీదొంగల ముఠా అలీవ్‌గ్రీన్‌కు షాద్‌నగర్‌లోని ఓ స్వర్ణకారుడితో సంబంధం ఉందా అని పోలీసులు ముఠా సభ్యులను విచారణ నిమిత్తం పట్టణానికి తీసుకొచ్చారు. అనంతరం ముఠా సభ్యులు నియోజకవర్గ శివారులో ఎన్‌కౌంటర్‌లో మతిచెందారు.
– గతంలో ఎస్‌ఐ శివకుమార్ వాహనాలను తనిఖీ చేస్తుండగా షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రి సమీపంలో ఒక ఐఎస్‌ఐ ఏజెంటును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
–2007లో ఫరూఖ్‌నగర్ మండలంలోని బూర్గులకు చెందిన ఓ నక్సలైట్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
– 20ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండులో ఇద్దరి వ్యక్తుల్ని వేటకొడవళ్లతో కొందరు కిరాతకంగా దాడిచేసి హతమర్చారు.
– నాలుగేళ్ల క్రితం పట్టణ శివారులోని అనూస్ పరిశ్రమ సమీపంలో రాయలసీమకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని కొందరు వేటకొడవళ్లతో వెంటాడి చంపారు.
– 2014లో ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద, చిల్కమర్రిలో నిల్వ ఉంచిన కోట్ల రూపాయల విలువ జేసే ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తరహాలో షాద్‌నగర్‌లో చోటు చేసుకున్న సంఘటనలన్నీ రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేసినవే. దీనికితోడు అంతర్జాతీయ విమానాశ్రయ పుణ్యమా అని ఇక్కడ భూములు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో రాజధానిలో తమసత్తా చాటుకున్న గ్యాంగ్‌స్టర్ల కన్ను ఇక్కడి వాటిపైనా పడింది. రాజధాని సమీపంలో తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అభివద్ధి చెందడంతో గ్యాంగ్‌స్టర్లు తమ ఉనికిని చాటుకున్నారు.
Advertisement