నందిగాం : రోడ్డు నిర్మాణం విషయంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నెలకొన్న సమస్య హైకోర్టు ఆదేశాలతో సర్దుమనిగింది అనుకునేలోపే, టీడీపీ నాయకులు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో మరలా మొదటికొచ్చింది. నర్సిపురం నుంచి జల్లపల్లి వరకు నిర్మిస్తున్న 35 అడుగుల రహదారి నిర్మాణం తమ్ముళ్ల అధికార దర్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ స్థలంలో రోడ్డు నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ.. వైసీపీకి అనుకూలంగా ఉన్న నర్సింహమూర్తి ఇంటి వైపు నుంచే నిర్మాణానికి పూనుకున్నారు. తనకు జరుగుతున్న అన్యాయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోడంతో నర్సింహమూర్తి కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందిచిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయినా అత్యుత్సాహంతో అధికార పార్టీ నాయకులు టెక్కలి ఆర్డీఓ సాయంతో బుధవారం ప్రహారీ గోడను కూల్చివేశారు. దీంతో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment