సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శిద్దా
సాక్షి, దర్శి: ఈ నెల 28వ తేదీ ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే ముఖ్యమంత్రి ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖామంత్రి శిద్దా రాఘవరావు కోరారు. సోమవారం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శిద్దా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ముఖ్యమంత్రి ఒంగోలులో చేపట్టే ధర్మపోరాట దీక్ష కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై మద్దతు తెలపాలని కోరారు. అనంతరం పట్టణంలోని పుచ్చలమిట్టలో జరిగిన గ్రామదర్శిని– గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఎంపీపీ సంజీవయ్య, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment