ఉద్యమం దారిమళ్లించేందుకు టిడిపి కుట్ర:శోభానాగిరెడ్డి | TDP conspiracy to deviate United Andhra movement: Sobhanagireddy | Sakshi
Sakshi News home page

ఉద్యమం దారిమళ్లించేందుకు టిడిపి కుట్ర:శోభానాగిరెడ్డి

Published Sat, Sep 28 2013 5:34 PM | Last Updated on Sat, Aug 11 2018 2:53 PM

ఉద్యమం దారిమళ్లించేందుకు టిడిపి కుట్ర:శోభానాగిరెడ్డి - Sakshi

ఉద్యమం దారిమళ్లించేందుకు టిడిపి కుట్ర:శోభానాగిరెడ్డి

హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దారిమళ్లించడానికి టీడీపీ కుట్ర చేస్తుందని వైఎస్ఆర్ సిపి శాసనసభ్యురాలు శోభానాగి రెడ్డి ఆరోపించారు. విభజన లేఖను వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఎస్ కుటుంబంపై అడ్డగోలు వార్తలు రాపిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై ఆరోపణలు రుజువు చేయలేకపోతే, సిఎం  రమేశ్‌ శాశ్వతంగా పదవి నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు.


తమని ఎన్ని తిట్టిన పర్వాలేదని చంద్రబాబు విభజన లేఖను మాత్రం  వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి చంద్రబాబు ముందుకు వస్తే తాము కూడా సహకరిస్తామని శోభానాగిరెడ్డి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement