నువ్వా.. నేనా..?
కురుపాం: కురుపాం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం మాజీ ఎమ్మెల్యేలు నిమ్మక జయరాజ్, జనార్దన్ థాట్రాజ్ వర్గీయులు నువ్వా..నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇరువర్గాల కుమ్ములాట ల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఈ సమ యంలో నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం మళ్లీ రెం డు వర్గాలు పోటీ పడుతుండడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక కార్యకర్తలు అయోమయూనికి గురవుతున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో చిన్న నా మినేటెడ్ పదవుల నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి పద వి వరకు అన్నీ తమ చేతిలోనే ఉండాలని రెండు వర్గా లు ప్రయత్నిస్తున్నారుు. అందులో ముందు గా నాయకుల దృష్టి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిపై పడింది. నెల రోజులు రెండు వర్గాలు ఇదే విషయమై తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి దక్కించుకోవడానికి ఇరువర్గాలు పావులు కదుపుతూ ..తమ బలాబలాలను పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రద ర్శించేందుకు హైదరాబాద్ పయనమయ్యూరు.
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జనార్దన్ థాట్రాజ్ ఓటమికి కారణమైన రెబల్ అభ్యర్థి నిమ్మక జయరాజ్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎలా ఇస్తారని థాట్రాజ్ వర్గీయులు వాదిస్తున్నారు. అలాగే జయరాజ్ కంటే థాట్రాజ్‌కు ప్రజాదరణ ఉందని, నిమ్మకపై జెడ్పీటీసీ సభ్యుడిగా కూడా ఒకానొకప్పుడు థాట్రాజ్ గెలుపొం దారని, అలాగే ఈ మధ్య జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా థాట్రాజ్ వల్లే టీడీపీ విజయం సాధిం చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే ఇన్‌చార్జి పదవి ఇవ్వాలని థాట్రాజ్ వర్గీయులు పార్టీ అధినేత వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.
ఇదే సమయంలో నిమ్మక వర్గీయులు కూడా తమ వాదనను పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గంలో మొదటి నుంచీ పార్టీ బలోపేతానికి కృషి చేసింది జయరాజ్ అని, ఆయన్ను పక్కన పెట్టి చివరి క్షణంలో పార్టీలో చేరిన థాట్రాజ్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం పార్టీ అధిష్టానం చేసిన తప్పు అని, అందువల్లే నియోజకవర్గంలో ఓటమి చెందామని చెబుతున్నారు. నిమ్మకకు నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. ఇలా ఇరువర్గీయులు తమ వాదనలను అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. కాగా థాట్రాజ్‌కు ఇప్పటికే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ ఉన్నట్టు ఆయన వర్గీ యులు చెబుతుండగా... నిమ్మకకు కూడా జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ఆశీస్సులు ఉన్నాయని.. ఇప్పటికే స్పష్టమైన హామీ కూడా ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.