janardhan thatraj
-
నువ్వా.. నేనా..?
కురుపాం: కురుపాం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం మాజీ ఎమ్మెల్యేలు నిమ్మక జయరాజ్, జనార్దన్ థాట్రాజ్ వర్గీయులు నువ్వా..నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇరువర్గాల కుమ్ములాట ల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఈ సమ యంలో నియోజకవర్గ ఇన్చార్జి పదవి కోసం మళ్లీ రెం డు వర్గాలు పోటీ పడుతుండడంతో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక కార్యకర్తలు అయోమయూనికి గురవుతున్నారు. పార్టీ అధికారంలో ఉండడంతో చిన్న నా మినేటెడ్ పదవుల నుంచి నియోజకవర్గ ఇన్చార్జి పద వి వరకు అన్నీ తమ చేతిలోనే ఉండాలని రెండు వర్గా లు ప్రయత్నిస్తున్నారుు. అందులో ముందు గా నాయకుల దృష్టి నియోజకవర్గ ఇన్చార్జి పదవిపై పడింది. నెల రోజులు రెండు వర్గాలు ఇదే విషయమై తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పదవి దక్కించుకోవడానికి ఇరువర్గాలు పావులు కదుపుతూ ..తమ బలాబలాలను పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ప్రద ర్శించేందుకు హైదరాబాద్ పయనమయ్యూరు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జనార్దన్ థాట్రాజ్ ఓటమికి కారణమైన రెబల్ అభ్యర్థి నిమ్మక జయరాజ్‌కు నియోజకవర్గ ఇన్చార్జి ఎలా ఇస్తారని థాట్రాజ్ వర్గీయులు వాదిస్తున్నారు. అలాగే జయరాజ్ కంటే థాట్రాజ్‌కు ప్రజాదరణ ఉందని, నిమ్మకపై జెడ్పీటీసీ సభ్యుడిగా కూడా ఒకానొకప్పుడు థాట్రాజ్ గెలుపొం దారని, అలాగే ఈ మధ్య జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా థాట్రాజ్ వల్లే టీడీపీ విజయం సాధిం చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకే ఇన్చార్జి పదవి ఇవ్వాలని థాట్రాజ్ వర్గీయులు పార్టీ అధినేత వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఇదే సమయంలో నిమ్మక వర్గీయులు కూడా తమ వాదనను పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గంలో మొదటి నుంచీ పార్టీ బలోపేతానికి కృషి చేసింది జయరాజ్ అని, ఆయన్ను పక్కన పెట్టి చివరి క్షణంలో పార్టీలో చేరిన థాట్రాజ్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం పార్టీ అధిష్టానం చేసిన తప్పు అని, అందువల్లే నియోజకవర్గంలో ఓటమి చెందామని చెబుతున్నారు. నిమ్మకకు నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. ఇలా ఇరువర్గీయులు తమ వాదనలను అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. కాగా థాట్రాజ్‌కు ఇప్పటికే చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ ఉన్నట్టు ఆయన వర్గీ యులు చెబుతుండగా... నిమ్మకకు కూడా జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి ఆశీస్సులు ఉన్నాయని.. ఇప్పటికే స్పష్టమైన హామీ కూడా ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. -
టీడీపీలో రాజుకుంటున్న అగ్గి!
ఎన్నికల సమయంలో ఒకరి టిక్కెట్‌ను ఇంకొకరు తన్నుకుపోయారు. దీనికి ప్రతీకారంగా రెబల్‌గా రంగంలోకి దిగి అతని ఓటమికి కారణమై మరొకరు కక్ష తీర్చుకున్నారు. వారిద్దరే నిమ్మక జయరాజ్, జనార్దన్ థాట్రాజ్. అయితే జయరాజ్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నాలు సాగుతుండడంతో దానికి థాట్రాజ్ వర్గం తీవ్రస్థాయిలో అభ్యంతరం చెబుతోంది. పార్టీ ఓటమికి కారణమైన వారిని మళ్లీ ఎలా ఆహ్వానిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో కురుపాం నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం : కురుపాం నియోజకవర్గం టీడీపీలో మళ్లీ అగ్గి రాజుకుంటోంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ రెబెల్‌గా బరిలోకి దిగి న నిమ్మక జయరాజ్‌ను పార్టీలోకి రప్పించే యత్నాలను జనార్దన్ థాట్రాజ్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తిని మళ్లీ ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నా రు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ వర్గీయులు హెచ్చరిస్తున్నారు. కురుపాం నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ ఉండేవా రు. కాకపోతే, ఎన్నికల సమయానికొచ్చేసరికి సీటు రాకపోవడం వల్ల వేరే పార్టీలోకి జంప్ చేయడమో, రెబల్‌గా బరిలో దిగడమో చేస్తున్నారు. దీంతో కొన్నాళ్లు పార్టీకి దూరమవుతున్నారు. అంతా సద్దుమణిగిన తర్వాత మళ్లీ ఆ పార్టీలో చేరుతున్నారు. మళ్లీ క్రియాశీలకంగా తయారవుతున్నారు. గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. టిక్కెట్ తనదే అని జయరాజ్ నమ్మకం పెట్టుకున్నారు. కానీ, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు టీడీపీలో చేరడంతో కురుపాం టిక్కెట్‌ను ఆయన మేనల్లుడు వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు ఎగరేసుకుపోయారు. చంద్రబాబుతో విజయరామరాజు చేసుకున్న ఒప్పందంలో భాగంగా నిమ్మక జయరాజ్‌కు మొండిచేయి ఎదురైంది. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రతీసారి ఇలాగే జరుగుతోందని ఆవేదనకు లోనయ్యారు. చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించి, టీడీపీ రెబెల్‌గా పోటీ చేశారు. కానీ ఓటర్లు కనికరించలేదు. మళ్లీ ఓడించారు. దీంతో స్తబ్ధుగా ఉండిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ ఆయనకు పార్టీపై మోజు ఏర్పడింది. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన్ను కలుపుకొని పనిచేసేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ తదితరులు తహతహలాడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సానుకూల సంకేతాలొచ్చాయో ఏమో గాని జియ్యమ్మవలస మండల పరిషత్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అందరూ కలుపుకొని పనిచేద్దామని జగదీష్ అన్నారు. పార్టీలోకి రావాలని జయరాజ్‌కు పరోక్షంగా సూచించారు. దీంతో జయరాజ్ కూడా స్పందిస్తూ తాను పార్టీలోనే ఉన్నానని, తనకు టిక్కెట్ రాకపోవడం వల్లఅన్యాయం జరిగిందని బాధపడ్డానని చెప్పుకొచ్చినట్టు తెలిసింది. ఈ పరిణామాలన్నీ తెలుసుకున్న జనార్దన్ థాట్రాజ్‌తో పాటు ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేసేం దుకు చంద్రబాబు వద్దకు వెళ్లినట్టు సమాచా రం. జయరాజ్ విషయంలో ఒక్క థాట్రాజే కాదు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆ రెండు వర్గాల మధ్య వివాదానికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. -
టీడీపీలో చేరిన శత్రుచర్ల, జనార్దన్
కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్రలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజు, ఆయన మేనల్లుడు, ఎమ్మెల్యే జనార్దన్ దాట్రాజ్లు గుడ్ బై చెప్పారు. ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై సీమాంధ్రలో ప్రజలు తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. రానున్నఎన్నికలలో ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. దాంతో సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో నిన్న మొన్నటి నేతల నుంచి సీనియర్ నేతలు వరకు అంతా కాంగ్రెస్ వీడాలని ఆలోచిస్తున్నారు. అందులోభాగంగా సీమాంధ్ర జిల్లాల నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్,గంటా శ్రీనివాస్ రావు, గల్లా అరుణకుమారిలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉత్తరాంధ్ర రాజకీయ చిత్రంలో తాము కనుమరుగు కాక తప్పదని శత్రుచర్ల, జనార్దన్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వారి స్వగ్రామమైన చిన్న మేరంగిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. తెలుగుదేశంలో చేరితే కనీసం భవిష్యత్తు అయినా ఉంటుందని కార్యకర్తలు సూచించడంతో శత్రుచర్ల, జనార్దన్ థాట్రాజ్లో ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.