కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్రలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజు, ఆయన మేనల్లుడు, ఎమ్మెల్యే జనార్దన్ దాట్రాజ్లు గుడ్ బై చెప్పారు. ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై సీమాంధ్రలో ప్రజలు తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. రానున్నఎన్నికలలో ఆ ప్రాంతంలో కాంగ్రెస్కు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. దాంతో సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో నిన్న మొన్నటి నేతల నుంచి సీనియర్ నేతలు వరకు అంతా కాంగ్రెస్ వీడాలని ఆలోచిస్తున్నారు. అందులోభాగంగా సీమాంధ్ర జిల్లాల నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్,గంటా శ్రీనివాస్ రావు, గల్లా అరుణకుమారిలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరిన సంగతి
తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉత్తరాంధ్ర రాజకీయ చిత్రంలో తాము కనుమరుగు కాక తప్పదని శత్రుచర్ల, జనార్దన్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వారి స్వగ్రామమైన చిన్న మేరంగిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. తెలుగుదేశంలో చేరితే కనీసం భవిష్యత్తు అయినా ఉంటుందని కార్యకర్తలు సూచించడంతో శత్రుచర్ల, జనార్దన్ థాట్రాజ్లో ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
టీడీపీలో చేరిన శత్రుచర్ల, జనార్దన్
Published Sun, Mar 16 2014 12:52 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement