
టీడీపీది రాజకీయ వ్యాపారం: బొత్స
హైదరాబాద్: అధికార పార్టీ టీడీపీ రాజకీయ వ్యాపారం చేస్తోందని పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యానారాయణ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీని అధికార పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా వాడుకుంటోందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు అసెంబ్లీలో నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును మరుగున పెట్టేందుకే పట్టిసీమ పేరుతో కొత్త ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని చెప్పారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు కోసం కేటాయించిన 1400 కోట్లతోపాటు ప్రోత్సాహకం పేరుతో అదనపు మొత్తాలు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.