
జేసీ సోదరులపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం!
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరులపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రావతి జలాశయం నుంచి వైఎస్ఆర్ జిల్లాకు ...
అనంతపురం : అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరులపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చిత్రావతి జలాశయం నుంచి వైఎస్ఆర్ జిల్లాకు నీటిని తీసుకెళ్లే పులివెందుల బ్రాంచి కెనాల్‌కు సింగవరం వద్ద జేసీ దివాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిన్న గండి కొట్టిన విషయం తెలిసిందే. ఈ చర్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
సింగపూర్ పర్యటన నుంచి రాగానే తనను కలవాలని చంద్రబాబు నాయుడు ...జేసీ సోదరులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అందరికీ నీటిని అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అయితే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం సరికాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడినట్లు సమాచారం.