పింఛన్.. వంచెన్.. | tdp government in pension will not be granted | Sakshi
Sakshi News home page

పింఛన్.. వంచెన్..

Published Thu, Apr 3 2014 4:45 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

పింఛన్.. వంచెన్.. - Sakshi

పింఛన్.. వంచెన్..

ఆ ఇద్దరికీ ఎంత తేడా... పింఛను కావాలన్నా,,.రేషన్ కార్డు కావాలన్నా... పక్కోడి చావును కోరుకోమనే దొర‘బాబు’... ఆ నరహంతక, నయవంచన పాలన ప్రజాగ్రహంతో అంతమైంది. జనం మనసెరిగిన మనసున్న మనిషి ప్రజా రంజక పాలన వచ్చింది. అడిగిన వారికీ, అడగని వారికీ అందరికీ పింఛన్లు, రేషను కార్డులు ఇచ్చారు. చరిత్రలో చదువుకున్న స్వర్ణయుగం లాంటి పాలనను ప్రజలు ప్రత్యక్షంగా అనుభవించారు. ఆనందించారు. అంతలోనే విధి ఆ మహానేతను దూరం చేసింది. తర్వాత ప్రభుత్వాలు మళ్లీ అయ్య‘బాబో’య్ అనిపించేలా వ్యవహరించాయి. ఇప్పుడు మరోసారి అటువంటి దౌర్భాగ్య పాలనకు గోరీ కట్టే అవకాశం ప్రజలకు వచ్చింది. తాను ముఖ్యమంత్రి అయితే పింఛను రూ.700కు పెంచుతానని వాగ్దానం చేసిన జననేత జగన్ పాలన కోసం వారు ఆశగా ఎదురు చూస్తున్నారు.
 
 సాక్షి, గుంటూరు: పెరిగిన పెన్షన్ల భారం తగ్గించుకునేందుకు వై.ఎస్. మరణానంతరం గద్దె నెక్కిన కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నింది. రేషన్ కార్డు, ఆధార్ సీడింగ్‌తో వడపోతకు ముమ్మర యత్నాలు చేసింది. తెల్ల రేషన్ కార్డుల్లో తప్పులు, ఆధార్ సీడింగ్‌తో సరిపోల్చి సామాజిక పింఛన్లు నిలుపుదలకు ఎత్తులు వేసింది. ఇందుకు ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి వడపోతకు శ్రీకారం చుట్టింది. ఆధార్ కార్డులో ఉన్న పేరుకు, రేషన్ కార్డులో ఉన్న పేరుకు ఒక్క అక్షరం తేడా ఉన్నా, పింఛన్ నిలుపుదలకు ఆదేశాలు జారీ చేసింది. వికలాంగులకు సదరం శిబిరాల పేరిట నానా ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యమంత్రులుగా రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో రెండు మూడేళ్ళ కోసారి కొత్త పింఛన్లు మంజూరు చేసి తొలగించిన వాటి స్థానంలో కొత్తవి మంజూరు చేశారు. గడచిన ఐదేళ్లలో పింఛన్ కోసం పెన్షన్‌దారులు పాట్లు పడని రోజు లేదు. 2004 తర్వాత అధికారంలోకొచ్చిన మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంతృప్తీకరణ స్థాయిలో పింఛన్లు మంజూరు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందాలనే సదాశయంతో పనిచేశారు. పింఛన్ సొమ్ము పెంచారు. వికలాంగులకు రూ.500, వితంతు, వృద్ధులకు రూ.200 అందించారు. 
 
 = 2009 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లు కాకుండా అందించిన పెన్షన్ల సంఖ్య 2,63,380. చంద్రబాబు హయాంలో కంటే వై.ఎస్. హయాంలో పెన్షన్ల సంఖ్య 1,57,849 పెరిగితే, వై.ఎస్. మరణం తర్వాత రాష్ట్రం తరఫున కాంగ్రెస్ సర్కారు పెంచిన పెన్షన్ల సంఖ్య తక్కువగానే ఉంది. 
 = మహానేత వై.ఎస్ ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రెండో సంతకంగా పింఛన్ల పెంపుపైనే చేస్తానని హామీ ఇవ్వడంతో వృద్ధులు, వితంతువుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వృద్ధులకు రూ.700, వికలాంగులకు రూ. వెయ్యి వంతున పింఛన్ అందిస్తానని జగన్ ప్రకటించారు. 
 
 వైఎస్ స్వర్ణయుగంలో..
అర్హులైన వారెవ్వరూ పింఛన్ కోసం ఎవ్వర్నీ దేబిరించాల్సిన అవసరం లేదని చెప్పిన సువర్ణయుగం అది. పింఛన్లు సంతృప్తీకరణ స్థాయిలో (సాచ్యురేషన్ లెవల్) అందించి వృద్ధాప్య పింఛన్ రూ.200, వికలాంగ పింఛన్ రూ.500కు పెంచి ప్రతి కుటుంబంలో తమ పెద్ద కొడుకుగా పిలుచుకున్న వై.ఎస్. రాజశేఖరరెడ్డి సువర్ణయుగం పాలన అది. ప్రతి మూడు నెలలకు కొత్త పింఛన్లు మంజూరు చేసిన ఘనత ఆ మహానేతకే దక్కుతుందని ముక్త కంఠంతో చెప్పిన రోజులవి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంచనుగా పింఛన్ అందుకున్న వృద్ధుల కళ్లల్లో ఆనందం మరచిపోలేనిది.
 
 చంద్రబాబు చీకటి పాలనలో..
 ఆ రోజుల్లో ఒక్క పెన్షన్ కూడా కొత్తగా మంజూరు చేయలేదు. ఒకరు చనిపోతే వారి స్థానంలో మాత్రమే మరొకరికి ఇవ్వగలం అని చెప్పిన రోజులవి. నెలకు అందించే పింఛన్ రూ.75 కూడా ఐదారు నెలలకు ఒకసారి చెల్లించారు. ఆనాడు వృద్ధాప్యంలో ఉన్నవారికి, వితంతువులకు, వికలాంగులకు అందిన సత్కారం అది. నా కొక పింఛన్ ఇప్పించండి అంటూ అధికారుల చుట్టూ తిరిగిన పింఛన్‌దారుల పాట్లు అవి. చంద్రబాబు చీకటి పాలన అది. ఎవరైనా పెన్షన్‌దారుడు చనిపోతేనే కొత్త పెన్షన్ మంజూరయ్యే దుర్భర పరిస్థితి. 
 
 పాలన కాలం వృద్ధాప్య వితంతు చేనేత వికలాంగులు మొత్తం
 2004కు ముందు 80,570 16,752 5 3,452 1,00,779 
 2004-09 1,20,198 93,083 6,728 38,619 2,58,628
 2009-2014 96,053 1,09,836 6,733 42,097 2,54,719
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement