సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం మండలంలో తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి నేటికీ క్లారిటీ లేకపపోవడంతతో ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తోంది. తొలుత 15,200ఎకరాలని హడావిడి చేసి రైతన్నలను రోడ్డెక్కించింది. నిరసనలు, ఆందోళనలు తీవ్రమైన తర్వాత తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గి 6వేల ఎకరాలైతే సరిపోతాయని అధికారుల చేత ప్రకటన విడుదల చేయించింది. ఇప్పుడేమో పురపాలక మంత్రి నారాయణ వచ్చి 5వేల ఎకరరాలు అవ్వొచ్చు..4వేల ఎకరరాలు కావొచ్చు...3వేల ఎకరాలు సరిపోవచ్చు...లేదంటే 1000,1500ఎకరాల్లో నిర్మించొచ్చు అంటూ అయోమయ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా వాయు మార్గ అనుమతుల మేరకు ఉంటుందని, ఇప్పటికైతే రాలేదని, సౌత్-వెస్ట్ మార్గంలోనే తాత్కాలిక ప్రతిపాదనలు తయారు చేశామని చెప్పుకొచ్చారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూ సమీకరణపై బుధవారం రాత్రి డీఆర్‌డీఏ సమావేశం భవనంలో అధికారులు, టీడీపీ నేతలతో మంత్రి నారాయణ రహస్య సమా వేశం నిర్వహించారు. అటు మీడియాకు గాని, ఇటు భోగాపురం రైతులకు గాని తెలియకుండా రైతుల సమావేశం పేరుతో హడావుడిగా నిర్వహించారు. వాస్తవానికైతే సమావేశంలో పాల్గొన్న వారంతా టీడీపీ నేతలే. స్వతహాగా రైతులైనప్పటికీ ఒకే పార్టీకి చెందిన వారు హాజరు కావడంతో సమావేశంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సుమారు గంటకు పైగా రహస్య సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ అక్కడికొచ్చిన మీడియాను చూసి మాట్లాడక తప్పలేదు. ఎయిర్‌పోర్ట్‌కు 5వేల ఎకరాలు సరిపోతాయని, భూసమీకరణ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారని చెప్పారు.
ఆమేరకు కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక రైతులతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో 1500ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి ఉందని, మిగతాది భూసమీకరణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. భూసమీకరణ/భూసేకరణ విధానంలో రైతుల నుంచి భూములు తీసుకునేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. భూ సమీకరణ ద్వారా తీసుకుంటే సదరు రైతులకు ఎయిర్‌పోర్ట్ పక్కనే అభివృద్ధి చేసిన భూమినిస్తే బహుళ అంతస్తులు నిర్మించడానికి ఎయిర్ అథారిటీ అభ్యంతరాలుంటాయని, దీనివల్ల రైతులకు లాభం ఉందన్నారు. అదే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని అభివృద్ధి ప్రాంతాల్లో ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఈమేరకు ఆయా జిల్లాల్లో గల ప్రభుత్వ భూములను గుర్తించి సిద్ధం చేయాలని మూడు జిల్లాల కలెక్టర్లకు ఆదేశించినట్టు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే పతివాడ, కలెక్టర్, జేసీ తదితరులు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్ట్‌పై స్పష్టత కరువు
Published Thu, May 14 2015 12:16 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement