Green Field Airport
-
దేశం కోసమే నా తపన
ఈటానగర్: ‘‘మా ప్రభుత్వం దేశ ప్రగతి కోసం 365 రోజులూ, 24/7 పని చేస్తోంది. నేనూ రోజంతా దేశం కోసమే శ్రమిస్తున్నా. ఈ రోజు ఉదయం ఇలా అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నా. తర్వాత వారణాసి వెళ్తా. సాయంత్రానికల్లా దేశానికి మరోవైపున ఉన్న గుజరాత్‌కు చేరుకుంటా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అరుణాచల్‌లో రాజధాని ఈటానగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని హొలోంగీలో తొలి గ్రీన్‌ఫీల్డ్ ‘డోన్యీ పోలో ఎయిర్పోర్ట్‘ను ఆయన శనివారం ప్రారంభించారు. సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి ఇది దోహదపడనుంది. దీని నిర్మాణానికి 2019 ఫిబ్రవరిలో మోదీ పునాదిరాయి వేశారు. ‘‘నేను పునాదిరాయి వేసిన ప్రాజెక్టులను నేనే ప్రారంభిస్తున్నా. పనుల్లో కాలయాపన జరిగే రోజులు పోయాయి. అన్నింటినీ రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలి. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పుడు ఎన్నికల గిమ్మిక్కన్నారు. కానీ, ఇప్పుడిక్కడ ఎన్నికల్లేకున్నా ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించాం. సదరు వ్యాఖ్యాతలకు ఇది చెంపదెబ్బ లాంటిది’’ అని ఈ సందర్భంగా ఆయనన్నారు. అనుసంధానం, విద్యుత్ మౌలిక సదుపాయాలతో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో నూతన ఉషోదయం కనిపిస్తోందని మోదీ పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని, తమ ప్రభుత్వం ఇక్కడి అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ‘‘ఈశాన్య రాష్ట్రాల్లో గత ఎనిమిదేళ్లలో ఏడు ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాం. టూరిజం, వాణిజ్యం, టెలికాం, టెక్స్టైల్స్ రంగాల్లో ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. మాకు ప్రగతే ముఖ్యం. ఎన్నికలు కాదు’’ అన్నారు. అరుణాచల్‌లోని తూర్పు కెమాంగ్ జిల్లాలో నిర్మించిన 600 మెగావాట్ల కెమాంగ్ హైడ్రోపవర్ ప్రాజెక్టును మోదీ శనివారం జాతికి అంకితం చేశారు. రూ.8,450 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో అరుణాచల్‌లో విద్యుత్ కొరత తీరిపోనుంది. కాశీ, తమిళనాడు..కాలాతీత సాంస్కృతిక కేంద్రాలు వారణాసి: మన దేశంలో కాశీ, తమిళనాడు కాలాతమైన గొప్ప సాంస్కృతిక, నాగరికత కేంద్రాలని మోదీ ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శనివారం ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కాశీ, తమిళనాడు రెండూ శివమయం, శక్తిమయం. కాశీలో విశ్వనాథ మందిరం, తమిళనాడులో రామేశ్వరం కొలువుదీరాయి. తమిళ సీమలో దక్షిణ కాశీ ఉంది’’ అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’తో భాగంగా కాశీ తమిళ సంగమం నిర్వహించారు. తమిళనాడు నుంచి 2,500 మందికిపైగా ప్రతినిధులు హాజరయ్యారు. నెల రోజులపాటు ఎగ్జిబిషన్ జరుగనుంది. చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు ప్రదర్శిస్తారు. -
భోగాపురంలో అప్రకటిత కర్ఫ్యూ
-
భోగాపురంలో అప్రకటిత కర్ఫ్యూ
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో బుధవారం అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎయిర్‌పోర్టు నిర్మాణంపై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాల ప్రజలకు, సర్పంచ్‌లకు, ఎంపీటీసీలకు కూడా రెవెన్యూ సిబ్బంది ఆహ్వానం పంపారు. తీరా ప్రజాభిప్రాయ సేకరణ సమయానికి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ప్రశ్నలు సంధిస్తారని అనుమానం వచ్చిన వారిని హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలను బయటికి రాకుండా నిర్బంధిస్తున్నారు. కేవలం టీడీపీ అనుకూలమైన నాయకులను మాత్రం ప్రజాభిప్రాయసేకరణ సమావేశానికి అనుమతిస్తున్నారు. దీనిపై ఎయిర్‌పోర్టు ప్రతిపాదిత గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. -
గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుతో జిల్లా అభివృద్ధి
భోగాపురం : రాష్ట్రంలో విజయనగరం జిల్లా వెనుకబడిన ప్రాంతమని ముఖ్యమంత్రి గుర్తించి భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రతిపాదించారని గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. మండలంలో మంగళవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ముందుగా తోటపల్లిలో రూ.1.28కోట్లతో నిర్మించిన బహుళ ప్రయోజన తుఫాను షెల్టరును, ముంజేరులో రూ.19.50లక్షలతో నిర్మించిన ప్రాధమిక పాఠశాల అదనపు తరగతి గదులను, భోగాపురంలో రూ.1.44కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగిని, రావాడ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.3.75లక్షలతో నిర్మించిన ఆర్ఓ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ముంజేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఇక్కడివారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడనుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3800కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించుకుంటే మన జిల్లాలోనే 380కిలోమీటర్లు వేశామని చెప్పారు. గ్రామాల్లో భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద ఇంకుడు గుంతలు తవ్వాలని, గ్రామ పరిశుభ్రత కోసం గ్రామాల్లో ఇంటికో మరుగుదొడ్డి ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంచేందుకు జిల్లాలో 1.25కోట్లు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని, మొక్కలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ పతివాడ నారాయణస్వామి నాయుడు, మాజీ ఎంఎల్ఏ కిమిడి గణపతిరావు, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎంపీపీలు కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్, జెడ్పీటీసీలు పడాల రాజేశ్వరి, ఆకిరి ప్రసాద్, పతివాడ అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్ట్‌పై స్పష్టత కరువు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం మండలంలో తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ప్రభుత్వానికి నేటికీ క్లారిటీ లేకపపోవడంతతో ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తోంది. తొలుత 15,200ఎకరాలని హడావిడి చేసి రైతన్నలను రోడ్డెక్కించింది. నిరసనలు, ఆందోళనలు తీవ్రమైన తర్వాత తప్పని పరిస్థితుల్లో వెనక్కి తగ్గి 6వేల ఎకరాలైతే సరిపోతాయని అధికారుల చేత ప్రకటన విడుదల చేయించింది. ఇప్పుడేమో పురపాలక మంత్రి నారాయణ వచ్చి 5వేల ఎకరరాలు అవ్వొచ్చు..4వేల ఎకరరాలు కావొచ్చు...3వేల ఎకరాలు సరిపోవచ్చు...లేదంటే 1000,1500ఎకరాల్లో నిర్మించొచ్చు అంటూ అయోమయ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా వాయు మార్గ అనుమతుల మేరకు ఉంటుందని, ఇప్పటికైతే రాలేదని, సౌత్-వెస్ట్ మార్గంలోనే తాత్కాలిక ప్రతిపాదనలు తయారు చేశామని చెప్పుకొచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ భూ సమీకరణపై బుధవారం రాత్రి డీఆర్డీఏ సమావేశం భవనంలో అధికారులు, టీడీపీ నేతలతో మంత్రి నారాయణ రహస్య సమా వేశం నిర్వహించారు. అటు మీడియాకు గాని, ఇటు భోగాపురం రైతులకు గాని తెలియకుండా రైతుల సమావేశం పేరుతో హడావుడిగా నిర్వహించారు. వాస్తవానికైతే సమావేశంలో పాల్గొన్న వారంతా టీడీపీ నేతలే. స్వతహాగా రైతులైనప్పటికీ ఒకే పార్టీకి చెందిన వారు హాజరు కావడంతో సమావేశంపై సందేహాలు తలెత్తుతున్నాయి. సుమారు గంటకు పైగా రహస్య సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ అక్కడికొచ్చిన మీడియాను చూసి మాట్లాడక తప్పలేదు. ఎయిర్‌పోర్ట్‌కు 5వేల ఎకరాలు సరిపోతాయని, భూసమీకరణ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు సూచించారని చెప్పారు. ఆమేరకు కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక రైతులతో సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో 1500ఎకరాల మేరకు ప్రభుత్వ భూమి ఉందని, మిగతాది భూసమీకరణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. భూసమీకరణ/భూసేకరణ విధానంలో రైతుల నుంచి భూములు తీసుకునేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. భూ సమీకరణ ద్వారా తీసుకుంటే సదరు రైతులకు ఎయిర్పోర్ట్ పక్కనే అభివృద్ధి చేసిన భూమినిస్తే బహుళ అంతస్తులు నిర్మించడానికి ఎయిర్ అథారిటీ అభ్యంతరాలుంటాయని, దీనివల్ల రైతులకు లాభం ఉందన్నారు. అదే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని అభివృద్ధి ప్రాంతాల్లో ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఈమేరకు ఆయా జిల్లాల్లో గల ప్రభుత్వ భూములను గుర్తించి సిద్ధం చేయాలని మూడు జిల్లాల కలెక్టర్లకు ఆదేశించినట్టు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే పతివాడ, కలెక్టర్, జేసీ తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్న భోగాపురం
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మించతలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు తమ భూములిచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. బలవంతంగా భూసేకరణ చేస్తే ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని ప్రకటించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వేలాదిమంది రైతులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. భూసేకరణకోసం గ్రామాల్లోకి వచ్చే అధికారులను అడ్డుకుంటామన్నారు. తమను సంప్రదించకుండా, ఒక్క సమావేశమైనా ఏర్పాటు చేయకుండా భూసేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. సామాన్యులకు ఉపయోగపడని ఎయిర్పోర్ట్ తమకెందుకని, దాని కోసం విలువైన మా భూములెందుకివ్వాలని ప్రశ్నించారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్ కోసం 15,200 ఎకరాలు సేకరించడమేంటని, తమ భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు మహా ధర్నా అనంతరం భోగాపురం తహశీల్దార్ లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. నిరసన ప్రదర్శనలో వైఎస్సార్సీపీ కార్య నిర్వాహక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు, టీడీపీకి చెందిన ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ దంతులూరి సూర్యనారాయణరాజుతో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి విమానాశ్రయం!
దగదర్తి: మండలపరిధిలోని దామవరం, సున్నపుబట్టి, దగదర్తి, వెలుపోడు గ్రామాల సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించిన భూములను మంగళవారం జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విమానాశ్రయం అవసరమని, అందుకోసమే సంబంధిత భూములను పరిశీలించామన్నారు. ఇప్పటికే జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, భారీగా పరిశ్రమలు ఉన్నాయన్నారు. విదేశాల నుంచి అనేకమంది పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వస్తున్నందున వారికి అవసరమైన భూములను కూడా పరిశీలిస్తున్నామన్నారు. త్వరలో విజయవాడ నుంచి అధికారులు విమానాశ్రయ భూములు పరిశీలించేందుకు జిల్లాకు వస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత కలెక్టర్ దగదర్తి నుంచి వెలుపోడు, సున్నపుబట్టి, దామవరంలలో పర్యటించి మ్యాప్ ఆధారంగా సంబంధిత భూములను పరిశీలించారు. పట్టాభూమి 362.99 ఎకరాలు, ఢిఫారం భూమి 414.71, అటవీభూమి 446.09, ప్రభుత్వ భూమి 534.55, సీజెఎఫ్ఎస్ 479.37, చెరువు 24.26, కొండలు 224.87 ఎకరాలను ఎయిర్‌పోర్టు కోసం ప్రతిపాదించినట్లు కలెక్టర్ దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకెళ్లారు. ఈ విషయమై మ్యాప్‌లో సూచించిన 2,486.84 ఎకరాలకు సంబంధించిన మ్యాప్‌ను మరొకమారు సరిచేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. చిగురిస్తున్న ఆశలు : అయితే గతంలో ఎన్నోసార్లు ఏయిర్పోర్టు అథారిటీ అధికారులు, జిల్లా అధికారులు సంబంధిత భూములను పరిశీలించి ఏయిర్ఫోర్ట్ నిర్మాణానికి భూములు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయినా ఎయిర్‌పోర్టు నిర్మాణం ముందుకుసాగడం లేదు. అయితే మంగళవారం జిల్లా కలెక్టర్ సంబంధిత భూములను పరిశీలించడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురించాయి. పరిశీలనలో కలెక్టర్‌తో పాటుగా కావలి ఆర్డీఓ నరసిం హం, తహశీల్దార్ కె లీల, సర్వేయర్ రాము, ఎస్సై వెంకటరావులు ఉన్నారు. -
కాకినాడలో జీఎంఆర్ పోర్టు!
రూ.2,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ 2,094 ఎకరాలు కేటాయింపు ఆరు నెలల్లో ప్రజాభిప్రాయ సేకరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌పోర్టులు, రోడ్లు, రైల్వే రంగాల్లో సేవలందిస్తున్న జీఎంఆర్ గ్రూపు తాజాగా ఓడ రేవుల వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతోంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో రూ.2,500 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఇందుకోసం జీఎంఆర్‌కు ఉన్న పోర్ట్ ఆధారిత సెజ్‌లో 2,094 ఎకరాలు కేటాయించారు. జీఎంఆర్ 10,500 ఎకరాల్లో కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్(కెసెజ్) పేరుతో మల్టీ ప్రోడక్ట్ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కాకినాడ రేవుకు సుమారు 30 కి.మీ. దూరంలో ఈ కొత్త రేవు రానుంది. తుని నియోజకవర్గం తొండంగి మండలం కోన ఏరియాలో ఈ రేవును ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కి తెలిపారు. అన్ని అధికారిక అనుమతులు వచ్చిన తర్వాత మూడేళ్లలోగా ఈ కొత్త పోర్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అయితే, ఎన్ని బెర్తులతో పోర్టు నిర్మించాలన్నది దానిపై ఇంక ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ప్రాథమిక అధ్యయనం పూర్తయ్యిందన్నారు. మరో నెలరోజుల్లో ప్రాజెక్టు రూపు రేఖలపై ఒక స్పష్టత వస్తుందని జీఎంఆర్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు. రాష్ట్ర విభజనతో కీలకంగా కాకినాడ రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికంగా కాకినాడ కీలకంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జీఎంఆర్ పోర్టు నిర్మాణం దృష్టిసారిస్తోంది. గత బడ్జెట్లో అరుణ్‌జైట్లీ కాకినాడను హార్డ్‌వేర్ హబ్‌గా ప్రకటించడం, ఇప్పటికే కాకినాడ-విశాఖ పెట్రోకెమికల్ హబ్‌గా వేగంగా వృద్ధి చెందడానికి తోడు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) అభివృద్ధి చేస్తుండటంతో పారిశ్రామికంగా కాకినాడ కీలకంగా మారుతోంది. దీనికితోడు కాకినాడ, నెల్లూరు మధ్యలో మరో పోర్టు కూడా లేకపోవడం కలిసొచ్చే అంశం. విశాఖలోని రెండు పోర్టులు, కాకినాడ పోర్టు, నెల్లూరు కృష్ణపట్నం పోర్టులు పూర్తిస్థాయిలో వినియోగిస్తూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో కాకినాడ ప్రాంతంలో మరో కొత్త పోర్టుకు డిమాండ్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ పార్క్ రానుండటంతో కార్గో హ్యాండ్లింగ్పైనే అధికంగా దృష్టిసారిస్తున్నామని జీఎంఆర్ అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగా కంటైనర్ కార్గోతో పాటు వివిధ ఎగుమతులు దిగుమతులకు అనుకూలంగా ఈ పోర్టును అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. -
ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు క్లియరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సైట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి వేణుగోపాల్ మంగళవారం వెల్లడించారు. మెస్సర్స్ ప్రకాశం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నట్టు పేర్కొన్నారు. స్థల సేకరణ, నిర్మాణం ఆ సంస్థ చేపట్టనుందని వివరించారు.