
ఫ్లెక్సీలు చించుకున్న తెలుగు తమ్ముళ్లు
అనంతపురం జిల్లా టీడీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం చివరికి ఫ్లెక్సీలు చించుకునే వరకు వెళ్లింది. మొదట మంత్రి పరిటాల సునీత ఫ్లెక్సీలను ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు చించేయడంతో సునీత వర్గీయులు ఆగ్రహించారు.
వరదాపురం సూరి ఫ్లెక్సీలకు బురద అంటించి వాటిని చించేయడంతో వివాదం చెలరేగింది. చివరికి ఈ వివాదం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది.