
మహానాడుకు రండి పవన్‌కల్యాణ్‌కు టీడీపీ ఆహ్వానం
పార్టీ నిర్వహించే మహానాడుకు హాజరు కావాలని సినీ నటుడు, జనసేన నాయకుడు కె.పవన్ కల్యాణ్‌ను తెలుగుదేశం
హైదరాబాద్: పార్టీ నిర్వహించే మహానాడుకు హాజరు కావాలని సినీ నటుడు, జనసేన నాయకుడు కె.పవన్ కల్యాణ్‌ను తెలుగుదేశం కోరుతోంది. ఈ విషయమై ఇప్పటికే ఆహ్వానం పంపినట్టు విశ్వసనీయ సమాచారం. టీడీపీ మహానాడు వచ్చే నెల 27 నుంచి 29 వరకూ విజయవాడలో జరగనుంది.
ఈ మూడు రోజుల మహానాడుకు హాజరైతే సంతోషమని, అలా వీలుకాని పక్షంలో ఎన్‌టీఆర్ జయంతి రోజైన మే 28న హాజరుకావాలని పవన్‌కు టీడీపీ అగ్ర నాయకత్వం కోరినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణంలో భూ సమీకరణ విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకించి ఉద్యమం చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఈ ఆహ్వానంపై ఇంకా తన అభిమతాన్ని తెలియజేయలేదు.