గుంటూరు: రాష్ట్రంలో అధికారులపై తెలుగుదేశం పార్టీ నాయకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగిపై దాడిని మరవక ముందే.. బుధవారం గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు పంచాయతీ కార్యదర్శి రమేశ్పై స్థానిక టీడీపీ నాయకుడు గుత్తా వెంకట్రావ్ దాడికి పాల్పడ్డాడు.
మంగళవారం జరిగిన చేపల చెరువు వేలంపాటలో తనకు సహకరించలేదనే అక్కసుతో వెంకట్రావ్ రమేశ్పై దాడికి దిగినట్టు సమాచారం. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. కాగా.. ప్రభుత్వ అండదండలతోనే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఇలా దాడులకు పాల్పడితే విధులు ఎలా నిర్వర్తించాలని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు.
పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నాయకుడి దాష్టీకం
Published Wed, Jul 29 2015 5:32 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement