
సాక్షి, కృష్ణా : మచిలీపట్నంలో టీడీపీ నాయకులు దాష్టీకానికి తెగబడ్డారు. 9వ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లపై దాడికి దిగారు. సచివాలయం ఇక్కడ ఉండటానికి వీలు లేదని నినాదాలు చేస్తూ ఆడవారిపై దాడి చేశారు. ‘కులం తక్కువ దానివి. నువ్వేంటే మాకు చెప్పేది’ అంటూ భారతి అనే 4 నెలల గర్భిణీపై పాక్షికంగా దాడి చేశారు. అదే విధంగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తుంటే ఓటర్ కార్డులు మీ చేతిలో ఉండటం ఏంటి.. అని వాలంటీర్లతో టీడీపీ నేతలు గొడవకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment