'అనంత' టీడీపీలో విభేదాలు | tdp leaders clash in ananthpur | Sakshi
Sakshi News home page

'అనంత' టీడీపీలో విభేదాలు

Published Fri, Sep 18 2015 2:07 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

tdp leaders clash in ananthpur

అనంతపురం: స్టాండింగ్ కమిటీ ఎంపిక అనంతపురం పట్టణ టీడీపీలో చిచ్చురేపింది. స్థానిక ఎమ్మెల్యే జయరాం నాయుడు, మేయర్ స్వరూప ఒక వర్గం కాగా, కార్పొరేటర్లు మరో వర్గంగా విడిపోయారు. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్ దాఖలు చేశారు. ధనలక్ష్మి అనే కార్పొరేటర్ శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయగా దానిని ఉపసంహరించుకోవాలని మేయర్ స్వరూప ఒత్తిడి తెచ్చారు.

విషయం తెలుసుకున్న జయరాంనాయుడు ధనలక్ష్మీ వద్దకు వెళ్లి వాగ్వివాదానికి దిగారు. ధనలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించకపోవటంతో అధికారులతో కూడా వాదులాట జరిగింది. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement