టీడీపీ నేతల్లో అసంతృప్తి రాగం | TDP leaders Discontent tune in Eluru | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల్లో అసంతృప్తి రాగం

Published Sun, Jun 22 2014 1:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

టీడీపీ నేతల్లో అసంతృప్తి రాగం - Sakshi

టీడీపీ నేతల్లో అసంతృప్తి రాగం

సాక్షి ప్రతినిధి, ఏలూరు :జిల్లా రాజకీయు చరిత్రలోనే తొలిసారిగా టీడీపీ, దాని మిత్రపక్షమైన బీజేపీ కలసి అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో విజయబావుటా ఎగురవేశాయి. టీడీపీ అధికారంలోకి రావడానికి పశ్చివుగోదావరి జిల్లా ఫలితాలు కీలకమయ్యాయనేది ఎవరూ కాదనలేని వాస్తవం. దీంతో ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ శ్రేణులు తవు పంట పండినట్టేనని భావించారు. కేబినెట్‌లోను, ఇతర పోస్టుల్లోనూ తవుకు కీలక శాఖలు దక్కుతాయుని ఆశపడ్డారు. కానీ.. ఆశించిన వారిని అందలమెక్కించని, ఎవరికీ కొరుకుడు పడని పార్టీ అధినేత చంద్రబాబునాయిడు వ్యవహార శైలితో జిల్లా టీడీపీ నేతల్లో, ప్రజాప్రతినిధుల్లో  ఇప్పుడిప్పుడే అసంతృప్తి రాగం మొదలవుతోంది. మంత్రివర్గం తొలి కూర్పులో జిల్లాకు రెండు పదవులు కేటాయించినప్పటికీ శాఖల కేటాయింపు వచ్చేసరికి పార్టీ  శ్రేణులు నిరుత్సాహపడే పరిస్థితి నెలకొంది.
 
 చింతలపూడి ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పీతల సుజాతకు గనులు భూగర్భ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఓ మాదిరి శాఖలు కట్టబెట్టినా, మిత్రపక్షమైన బీజేపీ తరఫున తాడేపల్లిగూడెం నుంచి గెలిచిన మాణిక్యాలరావుకు ఎవరూ తీసుకోవడానికి ముందుకురాని దేవాదాయ శాఖను అప్పగించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అనూహ్యంగా మంత్రి పదవి రావడంతో దక్కిందే చాలని బీజేపీలోని జూనియర్లు సంతృప్తిపడుతున్నా.. సీనియుర్లు వూత్రం ఒకింత అసంతృప్తిగానే ఉన్నా రు. బీజేపీకి ఇచ్చిన పదవిని మినహా యిస్తే టీడీపీకి ఒక మంత్రి పదవితో సరిపుచ్చడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీకి మొదటి నుంచీ కొమ్ముకాస్తున్న  సావూజిక వర్గానికి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు తాజాగా విప్ పదవిని కట్టబెట్టారు.
 
 వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రభాకర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా కేవలం శాసనసభ వ్యవహారాలకే పరిమితమయ్యే విప్ పదవిని కట్టబెట్టడంపై పార్టీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. చింతవునేనితోపాటు ఇతర జిల్లాలకు చెందిన కూన రవికువూర్, యూమినీబాల, మేడా వుల్లికార్జునరెడ్డిలకు విప్‌లుగా అవకాశమిచ్చారు. వీరిలో చింతవునేని తప్ప మిగిలిన ముగ్గురూ తొలిసారి ఎన్నికైన వారే. చింతమనేనికి కనీసం చీఫ్ విప్ పదవిని కట్టబెట్టినా బాగుండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి ఇవ్వడానికి అడ్డుపడేంతటి కేసు లు, వివాదాలు తమ నేతకు లేవని, అయినా మంత్రి పదవిని ఇవ్వలేని పక్షంలో  చీఫ్ విప్ పదవిని కట్టబెడితే బాగుండేదన్న అభిప్రాయాన్ని ఆయన అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.  ప్రభాకర్ విషయాన్ని పక్కనపెడితే సామాజికవర్గాల సమతూకంలో మరో రెండు వర్గాలకు పదవులను కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 డెల్టాలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బలమైన రెండు సావూజిక వర్గాలకు ఏం పదవులు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఆచంట ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి వరుసగా రెండుసార్లు గెలుస్తూ వచ్చిన ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. పోలవరం నుంచి గెలిచిన ఏకైక ఎస్టీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు తొలివిడతలో మంత్రి పదవి దక్కకపోవడంతో ఒకింత అసంతృప్తికి లోనయ్యారు. విస్తరణలో అయినా వీరికి అవకాశం దక్కుతుందా, లేదా ఇతర ప్రభుత్వపరమైన పదవులు కట్టబెడతారా అనేది వేచిచూడాల్సిందే.
 
 కీలక శాఖలన్నీ పొరుగు జిల్లాలకే
 జిల్లా మొత్తం స్వీప్ చేసినా ఇక్కడి నేతలకు పదవుల పంపకంలో ప్రాధాన్యత లభించలేదన్న వాదనలు వినిపిస్తున్నారుు. పొరుగు జిల్లా నేతలకు ఇచ్చిన పదవులతో పోల్చిచూస్తున్న విశ్లేషకులు ఈ వాదనలను ప్రముఖంగా వినిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 సీట్లకు గాను 14సీట్లు గెలిచిన టీడీపీ నేతలకు పదవుల పంపకంలో అగ్రతాంబూలం లభించింది. ఆ జిల్లాకు చెందిన నిమ్మకాయల చినరాజప్పకు ఉపముఖ్యమంత్రి, కీలకమైన హోం శాఖ, ఎమ్మెల్సీ కోటాలో యనమల రామకృష్ణుడుకు ఆర్థిక, శాసనసభ వ్యవహారాలను అప్పగించారు. కృష్ణాజిల్లాలో దేవినేని ఉమామహేశ్వరరావుకు కీలకమైన భారీ,
 
 మధ్యతరహా నీటిపారుదల శాఖ, కొల్లు రవీంద్రకు ఎక్సైజ్‌శాఖ కట్టబెట్టారు. మండలి బుద్ధప్రసాద్‌కు డెఫ్యూటీ స్పీకర్ ఇవ్వనున్నారు. ఇదే జిల్లానుంచి బీజేపీ తరఫున గెలిచిన కామినేని శ్రీనివాస్‌ను వైద్య, ఆరోగ్యశాఖ వరించింది. మరోవైపు 17 నియోజకవర్గాలకు గాను 12 స్థానాల్లో మాత్రమే టీడీపీని గెలిపించిన గుంటూ రు జిల్లాకూ కీలక పదవులు లభిం చాయి, ఆ జిల్లాకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యవసాయ శాఖ, రావెల కిషోర్‌బాబుకు సాం ఘిక సంక్షేమ శాఖ ఇవ్వగా, స్పీకర్ పదవిని సైతం ఆ జి ల్లాకే చెందిన కోడెల శివప్రసాదరావుకు అప్పగించారు. పొ రుగు జిల్లాలకు ఎక్కువ పదవులతోపాటు ప్రాధాన్యత గల పదవులు ఇచ్చి న టీడీపీ అధినాయకత్వం పశ్చిమగోదావరి జిల్లా నేతలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది పార్టీ శ్రేణులకు అర్థం కావడం లేదు. ఈ విషయమై టీడీపీ నేతల్లో అసంతృప్తి మొదలైనా బయుటపడితే బాగోదని నోరునొక్కు కుంటున్నారు.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement