టీడీపీ మార్కు రాజకీయం!
Published Tue, Feb 11 2014 2:21 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM
కొత్తవలస, న్యూస్‌లైన్: టీడీపీ నాయకులు తాము చెప్పిందే వేదమన్నట్టు వ్యవహరిస్తున్నారు. తమ మాట వినకపోతే ఎలాంటి చర్యలకైనా పాల్పడుతున్నారు. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారుగా పోటీ చేసిన వ్యక్తికి ఓట్లు వేయలేదన్న అక్కసుతో దత్తి, దన్ని న పేట గ్రామాలకు తాగునీరు, విద్యుత్ సరఫరాను బంద్ చేశారు. ఇలా. ఒకటి, రెండు కాదు సుమారు నాలుగు నెలలుగా ప్రజలను ఇబ్బం దులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు తమ పార్టీ రంగును పులుముతున్నారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా...? టీడీపీ ప్రభుత్వ మా..? అని ముక్కున వేలేసుకుంటున్నారు.
గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అప్పన్నపాలెం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా తిక్కాన చినదేముడు భార్య మహాలక్ష్మి పోటీ చేశారు వాస్తవానికి 20 ఏళ్లుగా వారే అక్కడ సర్పంచ్‌గా ఎన్నుకవుతున్నారు. అరుుతే గతసారి ఎన్నికల్లో వారికి పోటీగా పంచాయతీ శివారు గ్రామాలైన దత్తి, దన్ని నపేట గ్రామాలకు చెందిన కోన దేముడు తన భార్యను కాంగ్రెస్ మద్దతుదారుగా నిలబెట్టారు. ఎన్నికల్లో తిక్కాన మహాలక్ష్మి గెలిచినప్పటికీ.. తక్కువ మెజార్టీ వచ్చింది. ఇం దుకు దత్తి, దన్నినపేట గ్రామాలే కారణం. ఆయూ గ్రామాలకు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుకి అధికంగా ఓట్లు వేయడంతో మహాలక్ష్మి కేవలం 11 ఓట్లతో తేడాతో గెలిచారు.
ప్రత్యర్థికి ఆరు ఓట్లు వస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచన టీడీపీ నాయకులు కలిగింది. దీంతో తమకు ఓట్లు వేయని ఆ రెండు గ్రామాలకు పంచాయతీపరంగా ఎలాంటి పనులు చేయకుండా ఉండాలని నిర్ణరుుంచినట్టు దత్తి, దన్నినపేట గ్రామాలకు చెందిన కోన దేముడు, దన్నిన అప్పలనాయుడు, మొయ్య దేముడుబాబు పెదిరెడ్ల మహాలక్ష్మి, పెదిరెడ్ల శంకరరావు, తదిత రులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే నాలుగు నెలలుగా రక్షిత పథకం మోటారు మరమ్మతుకు గురైనా.. పట్టించుకోవడం లేదని చెబుతు న్నారు. అలాగే పింఛన్ల పంపిణీ, ఉపాధి పనుల్లోనూ జోక్యం చేసుకుంటూ అనర్హులకు కట్టబెడుతున్నారని తెలిపారు. ఇందులో కార్యదర్శి హస్తం కూడా ఉన్నట్టు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పంచాయతీ సర్పంచ్‌తో పాటు కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.
విద్యుత్ స్తంభాలు, కుళాయిలకు పసుపు రంగు
పంచాయతీలో ఏ గ్రామంలో చూసినా..విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ కుళారుులపై పసుపు పచ్చరంగు వేశారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా..పంచాయతీ పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ సీహెచ్ దేముడుని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా దీనిపై గతంలోనే తమకు ఫిర్యాదు అందిందని, విద్యుత్ స్తంభాలకు వేసిన రంగును మార్పిస్తామని చెప్పారు. కాగా ఈ విషయమై గ్రామ సర్పంచ్ భర్త తిక్కాన చినదేముడును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా... తమ సొంత నిధులతో గ్రామంలోని విద్యుత్ స్తంభాలు రంగు వేయించామన్నారు. రక్షిత పథకం మరమ్మతుల కోసం గతంలోనే బోరు తీయించామని, అయితే ప్రస్తుతం నిధుల లేమి వల్ల పనులు చేపట్టలేకపోతున్నామని తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే పనులు చేస్తామని చెప్పారు.
పిచ్చి చేష్టలు మానుకోవాలి...
జిల్లాలో అన్ని పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇలాంటి పిచ్చిచేష్టలు ఎక్కడా చేసిన దాఖలాలులేవు. ప్రభుత్వ పథకాలకు పార్టీ రంగు వేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి.
- ఎం. దేముడుబాబు (ఏఐకెఎంఎస్ నాయకుడు).
నాలుగు నెలలుగా మంచినీరు లేదు...
నాలుగు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. రక్షిత పథకం పని చేయడం లేదని సర్పంచ్‌కి చెప్పినా.. వినడం లేదు. గతసారి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారికి ఓట్లు వేయలేదని ఇలా చేస్తున్నారు.
- దన్నిన లక్ష్మి, దత్తిగ్రామం.
Advertisement
Advertisement