చంద్రబాబుకు ఎల్పీనగర్, మునుగోడు తమ్ముళ్ల షాక్! | TDP leaders rendered resignation to party in Munugodu, LB Nagar | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఎల్పీనగర్, మునుగోడు తమ్ముళ్ల షాక్!

Published Sun, Apr 20 2014 4:23 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

చంద్రబాబుకు ఎల్పీనగర్, మునుగోడు తమ్ముళ్ల షాక్! - Sakshi

చంద్రబాబుకు ఎల్పీనగర్, మునుగోడు తమ్ముళ్ల షాక్!

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు షాక్ ఇచ్చారు. ఇప్పటికే టికెట్లు ఆశించి భంగపడ్డ తెలుగు తమ్ముళ్లు నిరసనలు, ఆందోళనలతో చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మునుగోడు, ఎల్పీనగర్ నియోజకవర్గాల ఇంచార్జ్ లు రాజీనామాలతో షాకిచ్చారు. 
 
మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ కర్ణాటి వెంకటేశం రాజీనామా సమర్పించగా, ఎల్బీనగర్ టీడీపీ ఇంచార్జ్ ఎస్వీ కృష్ణప్రసాద్ సహా 200 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. ఎల్పీనగర్ టికెట్ ను ఆశించిన కృష్ణ ప్రసాద్ పార్టీ రాజీనామా చేసి  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత గందరగోళం నెలకొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement