అనంతపురం అర్బన్: చిలమత్తూరు మండలం కొడికొండ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కార్మిక సంఘా నాయకులు, కార్మికులపై దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని వామపక్ష పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పరిగి మండలం పైడేటి వద్ద ఉన్న ఎస్‌ఏ రావ్‌తార్ స్పైసెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. దీంతో వారిని కంపెనీ యాజమాన్యం తొలగించిందన్నారు. అందుకు నిరసనగా ధర్నా చేసిన 183 మంది కార్మికులనూ తొలగించారన్నారు. యాజమాన్యం వైఖరిపై కార్మిక శాఖ అధికారుల వద్ద కేసు నడుస్తోందన్నారు.
దీంతో గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు సీఐటీయూ నాయకులు, కార్మికులు అనుమతి కోరితే అధికారులు నిరాకరించారన్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు నాయకులు, 12 మంది కార్మికుల వెళ్లగా పరిగి ఎంపీపీ భర్త మన్సూర్ ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారన్నారు. కార్మికులపైదాడిచేసిన టీ డీపీ కార్యకర్తలు, ప్రేక్షక పాత్ర పోషించిన ఎస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే శారు. ఎస్పీని కలిసిన వారిలో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సీఐటీ యూ జిల్లా కార్యదర్శులు డి.జగదీశ్, వి.రాంభూపాల్, సి.పెద్దన్న, ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, ఇ.ఎస్.వెంకటేశ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, తదితరులున్నారు.
‘టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలి’
Published Sat, Apr 23 2016 4:27 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement