రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజల ఆందోళనకు పరిష్కారం చూపాలని ప్రధానికి చంద్రబాబు లేఖ రాశారు. 2009లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలో అశాంతి నెలకొందని, అనిశ్చితి ఏర్పడిందని, ఆత్మహత్యలు పెరిగాయని అందులో పేర్కొన్నారు. తాజా నిర్ణయం సైతం అలాంటి పరిస్థితులకు దారి తీసేలా ఉందని వివరించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను చూసి తీవ్ర మానసిక క్షోభకు గురై లేఖను రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ లేఖ వివాదాస్పదమైంది. త మ పార్టీ అధినేత యూటర్న్ తీసుకోవడం తెలు గు తమ్ముళ్లను ఆందోళనకు గురి చేస్తోంది.
అధినేత రెండు నాల్కల ధోరణతో వ్యవహరిస్తుం డడం, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో టీడీపీ భాగస్వామిగా ఉండడం, తమ పార్టీకి చెందిన ఎంపీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా పార్లమెంట్ సమావేశాలను అడ్డుకుంటుండడం వంటివాటిని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు సైతం తెలంగాణపై యూ టర్న్ తీసుకుంటూ ప్రధానికి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిం ది. కాంగ్రెస్‌తో కుమ్ముక్కు రాజకీయాలకు ఇది అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తెలంగాణ ప్రకటించిన తర్వాత ఉత్సాహంగా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్న తెలుగు తమ్ముళ్లు.. అధినేత ప్రధానికి రాసిన లేఖాస్త్రంతో డీలాపడిపోయారు. తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. లేఖ వల్ల కార్యకర్తల నుంచి ఎదురవుతున్న ఎదురురుదాడి, అసంతృప్తి సెగలను ఎవరికి వివరించాలో తెలియని అయోమయ పరిస్థితిలో స్థానిక నేతలు కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ విషయంలో అధినేతను నిలదీయాలా.. లేక పార్టీని విడిచి రాజకీయ భవిష్యత్తు కోసం వలస బాటపట్టాలా అన్న సందిగ్ధంలో ఉన్నా రు. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్టీ మారే ఆలోచనలో పలువురు నేతలు
Published Wed, Aug 14 2013 6:38 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement