
(ఫైల్ ఫోటో)
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. దుమ్ములపేట ప్రాంతంలోని హౌసింగ్ సైట్ పరిశీలిస్తామని టీడీపీ బృందం ప్రకటించింది. మడ అడవులను ధ్వంసం చేస్తూ ఇళ్ల పట్టాలను ఇస్తున్నారని అసత్య ఆరోపణలు చేస్తూ.. దుమ్ముల పేట ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ కాకినాడకు చేరుకున్నారు. దీంతో టీడీపీ కార్యాలయంలో మాజీ హోం మంత్రి చినరాజప్ప, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబులను పోలీసులు అడ్డుకున్నారు. (‘రైతు భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్)
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నందున పర్యటనకు అనుమతుల్లేవని పోలీసులు స్పష్టం చేశారు. ఇక చేసేది ఏం లేక టీడీపీ బృందం వెనక్కి తగ్గింది. మీడియో సమావేశం అనంతరం పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి పోయారు. కాగా దుమ్ములపేట వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ బృందానికి గట్టిగా సమాధానం చెప్పాలని ఇటు ఇళ్ళ స్ధలాల లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. (పక్కా.. ఈ బుడతలు మిమ్మల్ని ఫిదా చేస్తారు )
Comments
Please login to add a commentAdd a comment