మైనర్ బాలికను గర్బవతిని చేసిన టీడీపీ కార్యకర్త!
Published Sat, Dec 14 2013 9:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
మైనర్ బాలికను గర్భవతి చేసిన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి టీడీపీ కార్యకర్త మురళీ పాల్పడినట్టు సమాచారం. మైనర్ బాలిక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న నిందితుడు.. బాధితురాలికి బలవంతంగా అబార్షన్ చేయించినట్టు తెలిసింది. అబార్షన్ చేయించడంతో బాధితురాలి ఆరోగ్యం విషమించించింది. ప్రాణాపాయస్థితిలో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి బంధువులు కేసు నమోదు చేయడానికి ప్రయత్నించగా.. వారిపై రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసు నమోదుచేయలేదని సమాచారం. పోలీసు కేసు నమోదు చేయకుండా బాధితురాలి బంధువులను మేనేజ్ చేసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన రామగిరి మండలం గంగులకుంటలో జరిగింది.
Advertisement
Advertisement