వేధించినా.. వెన్ను చూపం | TDP on legal battle government would | Sakshi
Sakshi News home page

వేధించినా.. వెన్ను చూపం

Published Sun, Jan 24 2016 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

TDP on legal battle government would

టీడీపీ సర్కారుపై న్యాయపోరాటం చేస్తాం
  వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష ఉపనేత జ్యోతుల
  కోర్టువద్ద చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి సంఘీభావం

 
 రాజమహేంద్రవరం లీగల్ :టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తూ, భయూనక వాతావరణం సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ శాసన సభాపక్ష ఉపనేత,జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. అయినా తాము భయపడబోమని, న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నేత, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని రాజమహేంద్రవరం పోలీసులు శనివారం స్థానిక మూడవ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు.
 
 గత ఆగస్టు 29న జరిగిన ప్రత్యేకహోదా బంద్ సందర్భంగా అరెస్టయిన పార్టీ నాయకులు జక్కంపూడి రాజా తదితరులు సెప్టెంబర్ 7న బెయిల్‌పై విడుదలయ్యూరు. ఆ సందర్భంగా వారికి మద్దతునిస్తూ చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు తమను బెదిరిస్తున్నట్టు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచీ పెండింగ్‌లో వారంట్‌ను ఆసరాగా చేసుకుని ఇప్పుడు చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జ్యోతుల విలేకరులతో మాట్లాడుతూ చెవిరెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారని నిరసించారు.
 
  పంచాయతీ ఎన్నికల్లో సమావేశం పెడితే దాని పైనా కేసు నమోదు చేశారని, అక్కడ చాలా మంది ఉన్నా వారిపై నమోదు చేయలేదని పేర్కొన్నారు. చెవిరెడ్డి పోలీస్ వ్యవస్థపై అభిప్రాయం వెల్లడించినందుకు రాజమహేంద్రవరంలో కేసు నమోదు చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల పై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అయినా భయపడేది లేదని, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
 
 సంఘీభావం తెలిపిన నేతలు
 ఎమ్మెల్యే చెవిరెడ్డికి కోర్టు వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు పలువురు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్సీలు  పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు,  పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వరుపుల సుబ్బారావు,  మాజీ ఎంపీ గిరజాల వెంకటస్వామి నాయుడు, కో ఆర్టినేటర్లు ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి  కర్రి పాపారాయుడు, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధరరావు, చీఫ్ విప్ ఈతకోటి బాపన సుధారాణి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా  కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు సుంకర చిన్ని,  ఇసుకపల్లి శ్రీనివాస్, గుర్రం గౌతం, పోలు కిరణ్ మోహన్‌రెడ్డి, మాసా రామజోగ్, మానే దొరబాబు, గెడ్డం రమణ, మేడపురెడ్డి రామకృష్ణ, నరవ గోపాలకృష్ణ, మేడపాటి అనిల్ రెడ్డి, అడపా హరి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, పత్తివాడ రమేష్‌బాబు, మజ్జి అప్పారావు, పెంకే సురేష్, కానుబోయిన సాగర్ సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు.
 
 భారీగా పోలీసుల మోహరింపు
 చెవిరెడ్డిని కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. దక్షిణ, తూర్పు, సెంట్రల్, ఉత్తర మండలాల డీఎస్పీలు శ్రావణి, సౌమ్యలత, కుల శేఖర్, ప్రసన్నకుమార్, ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్, ఏబీ డీఎస్పీ రామకృష్ణ, డీటీఆర్‌బీ డీఎస్పీ అంబికా ప్రసాద్, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ భరత్ మాతాజీ, ఏఆర్ డీ ఎస్పీ గాదే శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం వన్‌టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, ప్రకాష్‌నగర్ సీఐలు రవీంద్ర, కె.నాగేశ్వరరావు, శ్రీరామ కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఇతర పోలీస్ స్టేషన్‌ల సీఐలు, ఎస్సైలతో పాటు యాంటీ గూండా స్క్వాడ్, ఏఆర్, మహిళా పోలీసులను పెద్ద సంఖ్యలో కోర్టు వద్ద మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement